ఇది ఇలా ఉండగా ఇప్పుడు రష్యాలో కండోమ్స్ వాడకం ఎక్కువ అయ్యిందని ఓ ప్రకటనలో తేలింది.ఉక్రెయిన్పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి.. ఇక రష్యా పై ప్రపంచ దేశాలు నిషేధం చెస్తున్నాయి. ఇప్పుడు ముందు చూస్తె నుయ్యి, వెనుక చూస్తె గొయ్యి అన్నట్లు పరిస్థితి మారింది. ఇలాంటి పరిస్థతుల నడుమ రష్యా ప్రజలు ఓ వస్తువును ఎక్కువగా కొనుగోలు చెస్తున్నారని సమాచారం.అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్‌లైన్ రీటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం భారీగా పెరిగాయని అంటున్నారు.
కాగా, రష్యా ప్రజలు రష్యా ప్రజలు కండోమ్‌లను అధికంగా కొనుగోలు చేయడానికి ఓ కారణం ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా సహా మిగిలిన దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో కండోమ్‌ల ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం రష్యన్ ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగానే కండోమ్ విక్రయాలు ఆ దేశంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు ప్రముఖ దేశాల ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ ధరలు డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అవసరాలకు మించి వాడకం జరుగుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి