కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు కిసాన్ యోజన పథకం కింద ఆర్థిక సహాయం అందుతున్న విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 1 నుంచి పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చి, రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తోంది. ఈ పధకం వలన లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి రైతుల ఖాతాలో ప్రతి ఏటా రూ.6000 జమ చేయబడుతుంది. ఇది రైతులకు నాలుగు నెలలకే అందుతుందన్న విషయం విదితమే. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది కేంద్ర సర్కారు. ఇప్పటి వరకు ఇలా 10 విడతలు రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోగా ఇప్పుడు 11 వ విడత కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు.

అది ఏప్రిల్  మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకోసం గాను మార్చ్ 31 లోపు రైతులు  e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది, లేదంటే పూర్తి చేయని రైతులు ఈ పథకానికి అనర్హులుగా మారుతారు. అటువంటి వారికి కేంద్రం ఈ పథకం కింద ఎటువంటి సహాయాన్ని అందించదు.  అయితే ఎవరైతే ఇందుకు అర్హులో వారి  ఈ మార్చ్ 31 లోగా ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులను గురించి తెలుసుకోవడం ముఖ్యం. రైతులకు ఈ పదకాన్ని వినియోగించుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 31లోగా e-KYC వివరాలను రైతులు నమోదు చేయాలి.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 10వ విడత రైతుల ఖాతాలలో జనవరి 1, 2022న విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇంకో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎవరైతే ఇంకా పూర్తి చేసి ఉండరో వారు వెంటనే కంప్లీట్ చేసి సహాయాన్ని అందుకోగలరు. అలా కాకుండా ఈ విషయం గురించి ఇంకెలా ఏమైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని సచివాలయానికి వెళ్లి సరైన వివరాలను పొందగలరు.


మరింత సమాచారం తెలుసుకోండి: