దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అగ్గిపుల్ల అంటించకుండానే అనే భగ్గుమంటున్నాయి. ఇక సామాన్య ప్రజలందరిని కూడా వణికిస్తున్నాయ్. అయ్యో దేవుడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని సామాన్య ప్రజలందరూ తలలు పట్టుకునే దుస్థితిని తీసుకువస్తున్నాయి. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు ఇక అందరి జేబులకు చిల్లులు పడేలా చేస్తూ ఉన్నాయి. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో ప్రస్తుతం జనాలు బెంబేలెత్తి పోతున్నారు. పెట్రోల్ పంపు వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతున్నారు.


 నిన్నటి వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగి పోయినప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తీవ్రంగానే ఉన్నాయ్. ఇప్పుడు ఎలక్షన్ ముగిసిన నేపథ్యంలో అటు పెట్రోల్ ధరలు గత రెండు వారాల నుంచి క్రమక్రమంగా పెరిగి పోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దాదాపు గత రెండు వారాల నుంచి ధరలను పెంచుతూ వస్తున్నా ముడి చమురు కంపెనీలు ఇటీవలే మంగళవారం రోజున కూడా పెట్రోల్ ధరలు పెంచేశారు. లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, లీటర్ డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.


 దీంతో ఇక పెట్రోల్ ధర మరింత పెరిగిపోయింది అన్నది తెలుస్తుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్‌ రూ.119.67, డీజిల్‌ రూ.103.92 కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగి పోవడం గమనార్హం. గత మార్చి 22 తర్వాత ఒకటి రెండు రోజులు మినగా వరుసగా ప్రతిరోజూ ఇంధన ధరలు పెరిగి పోతూనే ఉన్నాయి. గత 15 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది 13వ సారి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: