ఒకవేళ ఎవరైనా నిబంధనలను కనుక అధిగమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ రామనవమి సందర్భంగా బెల్ట్ షాప్ లను క్లోజ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. శ్రీ రామనవమి సందర్భంగా నగరంలో ఊరేగింపులు, కోలాహాలాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా దేవుని ఊరేగింపులు ఏ ఏ ప్రాంతాలలో జరగాలి వంటి వాటి గురించి క్లారిటీ ఇస్తూ ఇప్పటికే నిర్ణయాన్ని కూడా ప్రకటించింది హైకోర్టు.
హైదరాబాద్ నగరం లోని, నిర్మల్ జిల్లా భైంసాలో కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి.... శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభాయాత్రకు అనుమతిచ్చినట్టు ప్రభుత్వం హైకోర్టుకు వివరించడం జరిగింది. దాంతో హైదరాబాద్ సిటీలో రెందు రోజుల పాటు మద్యం దొరకదన్నమాట. కొందరైతే ఈ న్యూస్ తెలుసుకుని ముందుగానే వారికి కావలసిన సరుకును ఆల్రెడీ తెచ్చి పెట్టేసుకున్నారట. ఇది పక్కన పెడితే రేపు శ్రీ రామ నవమి ని అంతా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ మంచి జరగాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి