చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ దిక్కుమాలిన పనులు అని ఒక సామెత ఉంది. ఈ  సామెత అటు చైనాఅధ్యక్షుడు జిన్ పింగ్ కి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే భారత్ లోకి వచ్చి మన ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యారు. చేయి చేయి కలిపి మన దేశాల మధ్య సంబంధాలు బాగుండాలి అంటూ  చెప్పారు. కానీ ఇండియా నుంచి చైనా వెళ్ళిన తర్వాత మాత్రం ఏకంగా భారత్ మీద ఆధిపత్యం సాధించేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంతంగా సరిహద్దుల్లో నిషేధిత భూభాగంలో  కూడా గుడారాలు ఏర్పాటు చేసుకుంది చైనా. సరిహద్దుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది తప్పు అని చెప్పడానికి వెళ్లిన భారత సైనికులు 20 మందికి పైగా చైనా సైన్యం హతమార్చింది . దీంతో భారత సైనికులు నుంచి వందల మంది చైనా సైనికుల తలలను విరిచేసిన పరిస్థితి కూడా నెలకొంది.


 చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో అటు భారత్ చైనాతో యుద్ధం చేయడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాపై యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ అందరూ అనుకున్నట్టుగా ఆయుధంతో కాదు.. ఆయుధ యుద్ధం చేసి మారణహోమానికి కారణం కావడం కంటే.. ఆర్థిక యుద్ధం చేసి దెబ్బ కొట్టడం మేలు అని భారత్ భావించింది. ఈ క్రమంలోనె ఇక చైనా నుంచి దిగుమతిచేసుకునే అన్నింటినీ కూడా నిషేధిస్తూ  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట చైనా యాప్స్ అనేది భారత్లో నిషేధించింది.


 ఇక ఆ తర్వాత చైనా నుంచి భారత్లోకి దిగుమతి చేసుకునే బొమ్మలపై అధిక టాక్స్ విధించి ఒక రకంగా నిషేధించినంత పని చేసింది. ఇలాంటి సమయంలోనే  స్వదేశీ బొమ్మలు తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు అందించింది. దీంతో 400 మిలియన్ డాలర్ల బిజినెస్ను 200 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక ఇప్పుడు  చైనా నుంచి దిగుమతి చేసుకునే ఫార్మ రా మెటీరియల్ మొత్తం భారత్లో తయారు చేసే విధంగా ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా క్రమక్రమంగా ఈ ఫార్మా రా మెటీరియల్ ను కూడా నిషేధించేందుకు సిద్ధమైంది. భారత్ ఇలా పరిస్థితులకు తగ్గట్టుగా ఆర్థిక యుద్ధం చేస్తూ చైనాను దెబ్బ కొడుతుంది మోడీ ప్రభుత్వం..

మరింత సమాచారం తెలుసుకోండి: