ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఎప్పుడూ చాలా సీరియస్ గానే ఉంటారని అందరికీ తెలిసిందే. ఎవరైనా జోక్ చేసినా పెద్దగా నవ్వరు. అలాంటి చంద్రబాబులో కూడా మంచి కమెడియన్ ఉన్నారనే విషయం ఇపుడే తెలిసింది. అలాంటి కామెడీనే తాజాగా చంద్రబాబు తెలంగాణా ప్రజలకు రుచిచూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో కొంతమంది నేతలతో భేటీఅయ్యారు.





ఆ సందర్భంగా మాట్లాడుతు  టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం టీడీపీ మాత్రమే అని చెప్పారు. తెలంగాణాలో పార్టీ బలపడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ధీటుగా టీడీపీ ఎదగాలంటు చెప్పారు. నిజానికి  చంద్రబాబు చెప్పింది సీరియస్ గానే అయినా చెప్పిన విషయాలు మాత్రం అందరికీ పెద్ద జోక్ గా అనిపించుండచ్చు. ఎందుకంటే చంద్రబాబు చెప్పింది మూడు జరిగేది కాదని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో పాటు అందరికీ తెలుసు.





దాదాపు ఎనిమిదేళ్ళక్రితం ఓటుకునోటు కేసు దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి విజయవాడుకు పారిపోయారు. ఓటుకునోటుకు భయపడే తెలంగాణాలో పార్టీని గాలికొదిలేశారని అందరికీ తెలుసు. అప్పటినుండి తెలంగాణాలో పార్టీ గురించి పట్టించుకున్నదే లేదు. స్వయంగా అధినేతే పారిపోయిన తర్వాత ఇక మిగిలిన నేతలు మాత్రం ఎందుకుంటారు. అందుకనే అప్పట్లో గెలిచిన ఎంఎల్ఏలు, ఓడిన నేతల్లో చాలామంది పార్టీని వదిలేశారు. అవకాశం ఉన్నవారు టీఆర్ఎస్ లో చేరిపోతే మరికొందరు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు.





ఆ తర్వాత మరికొందరు నేతలు బీజేపీలో చేరిపోయారు ఏ అవకాశం రానివారు మాత్రమే టీడీపీలో ఉన్నారు. మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే తెలంగాణాలో టీడీపీ జెండాను ఎప్పుడో ఎత్తేశారు. అయితే ఎలాంటి పొలిటికల్ యాక్టివిటి జరగకపోతే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ లాగేసుకుంటుందో అన్న భయంతోనే అప్పుడప్పుడు చంద్రబాబు ఇలాంటి మీటింగులు పెట్టుకుంటున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలొస్తే పోటీచేయటానికి అభ్యర్ధులు కూడా దొరకరు.  ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చంద్రబాబు అంటే కామెడీ కాకుండా మరేమిటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: