వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు ఒకటే టార్గెట్ మీద కన్నేశారు. ఇంతకీ ఆ టార్గెట్ ఏమిటంటే బీసీ ఓటుబ్యాంకు. పార్టీకి దూరమైన ఓటుబ్యాంకును తిరిగి ఎలాగైనా సంపాదించుకోవాలని చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ దగ్గర మిగిలున్న ఓటుబ్యాంకును కూడా బయటకు లాగేసి తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.





ఇద్దరు చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత వాళ్ళ  ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అవుతారనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ విషయం ఏమిటంటే టీడీపీ మొదటినుండి బీసీల మద్దతు వల్లే చాలా స్ట్రాంగ్ ఉండేది. అయితే బీసీల మద్దతును కష్టపడి చంద్రబాబు చెడగొట్టుకున్నారు.  ఎన్టీయార్ హయాంలో పార్టీకి బీసీలు పటిష్టమైన ఓటుబ్యాంకును వివిధ కారణాలతో  చంద్రబాబు దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే టీడీపీకి బీసీలు దూరమవుతున్నారని జగన్ గ్రహించారో వెంటనే పెద్ద పీట వేయటం మొదలుపెట్టారు.





ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీకి వచ్చిన ఒకటి అరా ఎంఎల్సీ పోస్టులను జగన్ బీసీలకు కేటాయించారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలోని ఎనిమిది లోక్ సభ టికెట్లలో జగన్ బీసీలకు ఆరు కేటాయించారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం బీసీలను పట్టించుకోలేదు. ఇద్దరికీ తేడాను గమనించిన బీసీలు జగన్ వైపుమొగ్గారు. దాంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలతో పాటు బీసీలు కూడా వైసీపీకి మద్దతుగా నిలవటంతో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.




అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన చంద్రబాబు ఎలాగైనా దూరమైన బీసీలను దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ ప్రయత్నాలంటే ఏమీలేదు 24 గంటలూ జగన్ను తిట్టడమే. అప్పుడెపుడో  బీసీలకు టీడీపీ ఎంతపెద్ద పీట వేసిందో చెప్పుకోవటమే. కానీ తన హయాంలో బీసీలకు ఏమి చేశారో మాత్రం చెప్పుకోలేకపోతున్నారు చంద్రబాబు. అందుకనే వచ్చే ఎన్నికల్లో టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న మిగిలిన బీసీలను కూడా లాగేయాలన్న జగన్ ప్లాన్. ఉన్నదాన్ని కాపాడుకోవటంతో పాటు దూరమైన వారిని మళ్ళీ దగ్గరకు తీసుకోవాలన్నది చందర్బాబు ఆలోచన. తాజా క్యాబినెట్లో 10 మంది బీసీలను జగన్ తీసుకోవటాన్ని చంద్రబాబు+తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి బీసీలను ఆకట్టుకోవటంలో ఎవరిది పైచేయవుతుందనేది ఆసక్తి మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: