ఎప్పటికప్పుడు జనరేషన్ మారుతూనే ఉంటుంది. ఇక ఈ జనరేషన్ కు తగ్గట్లుగానే మనిషి ఆలోచనా తీరులో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాగా  కొన్ని కొన్ని సార్లు కొంతమంది వ్యక్తులు వినూత్నంగా ఆలోచించే తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఆలోచన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. కేరళ అంటేనే అక్షరాస్యతలో ఎప్పుడు టాప్ లో ఉండే రాష్ట్రం అన్న విషయం తెలిసిందే. అక్కడ బడ్డీ కొట్టు నడుపుకునే వ్యక్తి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వ్యక్తి వరకు అందరూ మంచి చదువులు చదివి ఉంటారు.


 ఇక అక్కడి నుంచి చాలా మంది దేశ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉంటారు అని చెప్పాలి. ఇంతకీ ప్రస్తుతం కేరళ చదువుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. సాధారణంగా చిన్నప్పుడు అందరూ బడికి వెళ్లే ఉంటారు. ఒకప్పుడు ఏకంగా చెట్ల కింద కూడా చదువులు చెప్పే వారు. ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి అందులో విద్యాబోధన చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా బస్సులనే బడులుగా మార్చేసింది కేరళ ప్రభుత్వం. కాలం చెల్లిన బస్సులను వృధాగా పక్కకు పెట్టడం ఎందుకు అని వినూత్నమైన ఆలోచన చేస్తుంది.



 కాలం చెల్లిన బస్సులను తుక్కుగా మార్చకుండా క్లాస్ రూములుగా తీర్చిదిద్దినట్లు కేరళ మంత్రి ఆంటోనీ రాజు ఇటీవల వెల్లడించారు. దీనివల్ల పిల్లలకు సరికొత్త అనుభూతి కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మొదట తిరువనంతపురం లోని ప్రభుత్వ స్కూల్ పిల్లలకు తరగతి గదులుగా రెండు బస్సులను ఏర్పాటు చేస్తామని.. దశలవారీగా 400 బస్సులను క్లాస్ రూములు గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఈ నిర్ణయం వల్ల సరికొత్త వాతావరణంలో పిల్లలు చదువుకునేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rtc