సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణమే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి కేంద్రంలోని పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన నడుస్తుంది అంటు విమర్శలు చేస్తున్నారు.. కేవలం కేంద్రం పెద్దలు మాత్రమే కాదు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇలాంటి విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇక కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి అంటే తప్పకుండా తమ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి అంటూ కేంద్రంలోని పెద్దలు తెలంగాణ ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. బీజేపీ మాత్రం కుటుంబ పాలనకు ఎప్పుడూ దూరంగానే ఉంటుందని చెబుతున్నారు.



 ఇలా గత కొంత కాలం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రం విమర్శలు ప్రతివిమర్శలు తీవ్రస్థాయిలో మారి పోయాయి అని చెప్పాలి.  ఇలాంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్ర పై విమర్శలు చేస్తోంది. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బిజెపి పెద్దలైన అమిత్ షా,  ప్రధానమంత్రి నరేంద్రమోదీ లను ఉద్దేశిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు అని చెప్పాలి. టిఆర్ఎస్ కుటుంబ పాలన చేస్తోంది అంటూ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.


 మహారాష్ట్ర హర్యానా లాంటి రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది అనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మర్చిపోయినట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటూ సూచించారు. తాము కుటుంబ పాలనకు దూరంగా ఉంటున్నామూ అని చెబుతున్నారు. అలాంటప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కొడుకు జై షా క్రికెట్ తో సంబంధం లేకుండా ఎలా బీసీసీఐ సెక్రటరీగా మారిపోయాడు అంటూ ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. అమ్మకానికి మోడీ నమ్మకానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు ఆయన..

మరింత సమాచారం తెలుసుకోండి: