ఒకప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలు ఇక వరుడు అప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక పెళ్లికి మాత్రం ఎంతో క్లీన్ షేవ్ చేసుకుని ముస్తాబవుతుండేవారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక పాతకాలంలో పెళ్లిళ్లు చేసుకునే వరుడు పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకుని కనిపిస్తాడు. ఇటీవలి కాలంలో మాత్రం గడ్డం పెంచుకోవడం ట్రెండ్ మారిపోయింది అన్న విషయం తెలిసిందే. భారీగా గడ్డం పెంచుకుని ఎంతో స్టైలిష్ లుక్ లో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు నేటి రోజుల్లో యువత.


 దీంతో నేటి రోజుల్లో జరుగుతున్న ఏ పెళ్లి లో చూసినా అటు వరుడు తప్పకుండా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నాడు అని చెప్పాలి. ఇలా ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్ళిళ్ళలో క్లీన్ షేవ్ తో పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కొడుకులు ఎక్కడా కనిపించడం లేదు. కానీ కొన్ని సామాజిక వర్గాలలో మాత్రం ఇప్పటికీ వరుడు పెళ్లి చేసుకునే ముందు తప్పకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలనే సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి.  రాజస్థాన్ లోని పాళీ లో కుమావత్, జాట్ సామాజిక వర్గాలు ఇటీవలే ఒక తీర్మానం చేసుకున్నాయి అనేది తెలుస్తుంది.


 ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంత సంపన్నులు అయినా సరే ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే వివాహాలను తక్కువ ఖర్చుతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు సామాజిక వర్గాలు. దీంతో ఇక నుంచి జరగబోయే పెళ్లి లో భారీ అలంకరణలు, డీజే చప్పుళ్ళు,  బాణాసంచాలు ఇక కనుమరుగు అవుతున్నాయి అని తెలుస్తుంది. అంతేకాకుండా వరుడు తప్పకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలి.. కేవలం వరుడు మాత్రమే కాదు వివాహానికి హాజరయ్యే వాళ్లందరూ కూడా తప్పనిసరిగా క్లీన్ షేవ్ చేసుకోవాలని నిబంధన విధించారు. డబ్బున్న వారు చేస్తున్న ఆర్బాటం పేద మధ్యతరగతి పై ప్రభావం చూపుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ రెండు సామాజిక వర్గాల పెద్దలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: