మనిషితో తొందరగా కలిసిపోయి అతి విశ్వాసం  చూపించే వాటిలో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అవిశ్వాసానికి మారు పేరైన కుక్కలను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇటీవల కాలంలో అయితే కుక్కల ని పెంచుకోవడం ట్రెండ్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే కుక్కలు ఎంత మనిషితో స్నేహం చేసిన వాటి స్వభావాన్ని మాత్రం అస్సలు మర్చిపోవు అన్న విషయం తెలిసిందే.


 అలాంటి వాటిలో ఒకటి యూరిన్ పోయడం మరొకటి పడుకునే విధానం కూడా ఉంటుంది. అయితే కుక్కలు కొన్ని కొన్ని సార్లు ఆకాశంవైపు చూస్తూ గట్టిగా అరవడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలా కుక్కలు అవడాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు ఎంతోమంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అయితే కుక్కలు ఇలా అరిస్తే.. అపోహలకు పోతు భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు అని చెప్పాలి. కుక్కలు ఇలా ఆకాశం వైపు చూసి అరవడానికి  ఒక పెద్ద కారణమే ఉందట. కుక్కలు పెంపుడు కుక్కలుగా పేరు సంపాదించక ముందు  అడవుల్లో తిరుగుతూ జీవనం సాగించేవి. అయితే వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా అక్కడే సమకూర్చుకుంటా ఉండేవి.


 అడవిలో వేటాడి సమకూర్చుకున్న ఆదాయాన్ని ఇక భూమి లో పాతిపెట్టి దాచుకునేవట. ఆహారం దొరకని పరిస్థితులు వచ్చిన సమయం లో ఇక ఇలా పాతిపెట్టిన ఆహారాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా తింటూ ఉండేవట. ఇక ఎలా అడవి లో తిరుగుతున్న సమయం లో తోటి కుక్కల తో కలిసి వేటకు వెళ్ళడం కోసం చందమామ కనిపించ గానే ఇక పెద్దగా అరుస్తూ మిగతా కుక్కలకు సైగ చేయడం లాంటివి చేస్తూ ఉండేవట. ఇక ఇప్పుడు ఇప్పుడు పెంపుడు కుక్కగా  జనాల్లోకి వచ్చిన తర్వాత కూడా కుక్కల్లో ఈ అలవాటు పోలేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: