ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులు అది గమనించి టీచర్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్‌తో పాటు.. తొడలపైనా వాతలు పెట్టినట్లు అతని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. విచారణ జరిపారు. అంగన్వాడీ టీచర్, సహాయకులకు నోటీసులు జారీ చేశారు. గాయపడిన చిన్నారికి జన స్వాస్థ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.పాపం ఒక 15 రోజుల క్రితమే బాలుడి తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. చిన్నారి ప్రస్తుతం తన అమ్మమ్మ, తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. ఈ చిన్నారి అన్నయ్య 6వ తరగతి చదువుతున్నాడు. తల్లి ఉన్నంతకాలం చిక్మగళూరులో నివసించగా.. తల్లి మరణానంతరం గోడకెరె గ్రామానికి వచ్చారు. అయితే, బాధిత చిన్నారికి తరచూ మూత్ర విసర్జన చేసే అలవాటు ఉందని, అది మాన్పించేలా చూడమని చిన్నారి అమ్మమ్మ అంగన్వాడీ టీచర్ని, సహాయకురాలిని కోరినట్లు వారు చెబుతున్నారు. అదిలించమని చెబితే.. ఇంత పని చేస్తారని ఊహించలేదని చిన్నారి అమ్మమ్మ ఎంతగానో బాధపడింది.