మాజీమంత్రి కొడాలినాని వైఖరి ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీయార్ వెన్నుపోటు ఘటనలో ఇంతకాలం కొడాలి కేవలం చంద్రబాబునాయుడును మాత్రమే ఎటాక్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీయార్ వెన్నుపోటులో చంద్రబాబుకు ఎన్టీయార్ వారసులంతా సహకరించిన మాట వాస్తవం. వారసులు సహకరించకపోతే  చంద్రబాబు అంత ధైర్యం చేసేవారు కాదు. వెన్నుపోటు ఘటన తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ ఎన్టీయార్ వైపు వచ్చేశారు.





వెన్నుపోటులో ఎవరిపాత్ర ఎంతన్న విషయంలో స్పష్టత లేకపోయినా హోలు మొత్తంమీద ఎన్టీయార్ అభిమానులు, న్యూట్రల్స్ మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఇదే నేపధ్యంలో చంద్రబాబును కొడాలి కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కొడాలి పొరబాటున కూడా ఎన్టీయార్ ఫ్యామిలిలో ఎవరినీ పల్లెత్తు మాటనలేదు. అలాంటిది ఇపుడు కొడాలి డైరెక్టుగా నందమూరి బాలకృష్ణను డైరెక్టుగా  ఎటాక్ చేశారు.





తండ్రిచావుకు కారణమైన చంద్రబాబుతో షో చేయటానికి సిగ్గుందా ? అంటు మండిపోయారు. తండ్రిచావుకు కారకుడైన చంద్రబాబుతో షో ఎలా చేస్తారంటు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్టీయార్ మరణించి 25 ఏళ్ళయినా ఇంకా అందరు కలిసి ఆయన ఆత్మను క్షోభ పెడుతునే ఉన్నారంటు ఆవేధన వ్యక్తంచేశారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు పోడిచి ఆయన చావుకు కారణమైంది సరిపోక చాట్ షోల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తారా అంటు చంద్రబాబు, బలయ్యపై కొడాలి రెచ్చిపోయారు.





పార్టీని కాపాడటానికే 1995లో అలా చేయాల్సొచ్చిందని చంద్రబాబు చెబితే దాన్ని బాలకృష్ణ ఆమోదించటం ఏమిటంటు నిలదీశారు. ఇదే విషయమై ఒక ఛానల్ నిర్వహించిన డిబేట్లో మాట్లాడిన కాలర్సంతా ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటి తరానికి 1995లో ఏమి జరిగిందో తెలిసే అవకాశం లేదు. అలాంటిది కోరిమరీ బావా, బావమరుదులు వెన్నుపోటు ఎపిసోడ్ ను ఎందుకు గోక్కుంటున్నారో అర్ధంకాలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కొడాలి మాట్లాడటం మామూలే. కానీ బాలయ్య మీద బహిరంగంగానే  రెచ్చిపోయారంటే దీనివెనుక ఏదో వ్యూహం ఉన్నట్లే ఉంది. నాలుగు రోజులాగితే అదేమిటో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: