రాబోయే ఎన్నికల్లో వైసీపీనే మళ్ళీ ఎక్కడ గెలుస్తుందో అనే టెన్షన్ ఎల్లోమీడియాలో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా బూతద్దంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపిస్తోంది. జనాలను ముఖ్యంగా ఉద్యోగులను ప్రభుత్వంపైకి రెచ్చగొడుతోంది. అయితే ఎల్లోమీడియా ఆశించినట్లు ఎక్కడా జరగటంలేదు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే రాబోయే ఎన్నికల విధుల నుండి టీచర్లను తొలగించారంటు పెద్ద గోల మొదలుపెట్టింది. ఎన్నికల బాధ్యతల నుండి టీచర్లను తప్పించి ఆ బాధ్యతలను సచివాలయ కార్యదర్శులకు అప్పగించింది.
టీచర్లను ఎందుకు తప్పించిందంటే వచ్చేఎన్నికల్లో వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని ప్రభుత్వం భయపడిందట. అందుకనే ముందుజాగ్రత్తగా టీచర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంపెట్టేసిందని ఎల్లోమీడియా తేల్చేసింది. ఇదే ఎల్లోమీడియా ఒకపుడు జనాల అభిప్రాయాలను పార్టీలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ టీచర్లు మార్చలేరని చెప్పింది. అంటే ఒకే అంశాన్ని తనకు ఎలా కావాలంటే అలా ఎల్లోమీడియా అచ్చేస్తోందని అర్ధమవుతోంది.
నిజానికి బోధనేతర విధుల నుండి తమను తప్పించాలని టీచర్ల సంఘాలు ఎప్పటినుండో డిమాండ్లు చేస్తున్నాయి. ఆ డిమాండుకు ప్రభుత్వం ఇపుడు సానుకూలంగా స్పందించిదంతే. ఇక టీచర్లకు ఉన్న అనుభవం సచివాలయ కార్యదర్శులకు ఎలాగుంటుందని ప్రశ్నించటమే విచిత్రం. ఎందుకంటే ఎవరికైనా ఎన్నికల కమీషన్ రెండుమూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియపై విడతలవారీగా ట్రైనింగ్ ఇస్తుంది. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నా లేకపోయినా ట్రైనింగ్ అయితే తప్పదు. కాబట్టి కొత్తవాళ్ళయినా ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది.
2019 ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి చంద్రబాబునాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఆశా వర్కర్లను, జన్మభూమి కమిటీలను వాడుకున్నారు. ఎన్ని ప్రయత్నాలుచేసినా జనాలైతే టీడీపీని ఘోరంగా ఓడించారు. చంద్రబాబు ప్రయత్నాలు చేసుకున్నపుడేమో ఎల్లోమీడియాకు చాణుక్యుడు కనిపించారు. అవే ప్రయత్నాలు ఇపుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటుంటే అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడేమో అన్న భయం ఎల్లోమీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భయం లేకపోతే ఇంత గోలచేయాల్సిన అవసరమే లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి