స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తు న్యాయమూర్తి తీర్పుచెప్పారు. ఏసీబీ కోర్టు తీర్పు చంద్రబాబుకు ఊహించని షాక్ అనేచెప్పాలి. విచారణ మొదలైన దగ్గర నుండి చంద్రబాబు స్కామ్ తో తనకు సంబంధంలేదని ఒకటేపాట పాడుతున్నారు. ఏసీబీ అధికారులు ఎన్నిరకాలుగా ప్రశ్నలు వేసినా చంద్రబాబు మాత్రం ఒకటే సమాధానం చెప్పారు. అదేమిటంటే తనకు ఏమీ తెలీదు..గుర్తులేదు.. మరచిపోయాను.





మొత్తానికి రెండువైపుల పకడ్బందీగా లాయర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున దేశంలోనే ప్రముఖ లాయర్లలో ఒకరైన సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తే ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదించారు. చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లు ఏవీ నిలబడవని, చంద్రబాబుకు ఎట్టి పరిస్ధితుల్లోను రిమాండ్ విధించలేరని టీడీపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులేమో రిమాండ్ తప్పదనే ధీమాతో ఉన్నారు.





చంద్రబాబు అరెస్టులో ఏసీబీ అధికారులు ప్రొసీజర్ ఫాలో కాలేదని పదేపదే లూథ్రా వాదించారు. అయితే చివరకు న్యాయమూర్తి లూథ్రా వాదనలను కొట్టిపారేశారు. చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వటానికి తగిన సెక్షన్లు, నేరం అవినీతి జరిగిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందుకనే చంద్రబాబుకు  14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించారు. రెండువైపుల లాయర్లు దాదాపు ఎనిమిదిగంటల పాటు వాదోపవాదనలు వినిపించారు. న్యాయమూర్తి ఇవ్వబోయే తీర్పు కోసం తెలుగురాష్ట్రాల్లోని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.





చంద్రబాబుకు రిమాండ్ విధించటంపై ఆయన తరపున లాయర్లు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ కు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయబోతున్నారు. ఏదేమైనా రిమాండ్ విధించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. తనపైన ఎన్నికేసులున్నా కనీసం విచారణకు కూడా రాకుండానే ఏదో విధంగా మ్యానేజ్ చేసుకుంటున్నారు. అలాంటిది మొదటిసారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టవ్వటమే చాలా ఎక్కువంటే 14 రోజుల రిమాండ్ విధించటం ఇపుడు సంచలనంగా మారింది. మరి ఈ కేసులో హైకోర్టు ఎలా స్పందిస్తుంది ? అక్కడ ఎలాంటి వాదనలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: