చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షాకుల మీద షాకులిస్తోంది. ఒక కేసు తర్వాత మరో కేసును తెరపైకి తీసుకొస్తోంది. దాంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. స్కిల్ స్కామ్ లో రెండురోజులు   సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు ఇవ్వటాన్ని టీడీపీ వాళ్ళు బ్లాక్ ఫ్రైడే అన్నట్లుగా చూస్తున్నారు. న్యాయనిపుణుల వ్యాఖ్యల ప్రకారమైతే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పీకల్లోతు ఇరుక్కున్నట్లే. అయితే దీంతో పాటు మరో స్కామ్ కూడా చంద్రబాబు మెడకు బాగా చుట్టుకోబోతోన్నదని సమాచారం.

ఈ స్కామ్ లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళని ప్రభుత్వం కీలకసాక్షిగా ప్రవేశపెట్టాలని డిసైడ్ అయినట్లు ప్రచారం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే స్కిల్ స్కామ్ కాకుండా  చంద్రబాబు మీద నమోదైన మరో మూడు కేసుల్లో ఫైబర్ గ్రిడ్ స్కామ్ కీలకమైనది. ఇందులో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా తగులుకోబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అసలైన ట్విస్టు ఏమిటంటే జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ నే ప్రభుత్వం కీలక సాక్షిగా వాడుకోవాలని అనుకుంటున్నదని సమాచారం.

చంద్రబాబుకు జడ గట్టి మద్దతుదారుల్లో ఒకళ్ళని అందరికీ తెలిసిందే. ఇలాంటి శ్రవణ్ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు కు  వ్యతిరేకంగా ఎలా సాక్షిగా మారుతారు ? ఎలాగంటే ఒకొపుడు అంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడే శ్రవణ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై కోర్టులో కేసు వేశారు.  చంద్రబాబు, లోకేష్, పల్లె రఘునాధరెడ్డి, వేమూరి రవికుమార్ ఆధ్వర్యంలో వేల కోట్లరూపాయల స్కామ్ జరిగిందని, షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు విదేశాలకు కోట్లాదిరూపాయలను పంపేశారని పిటీషన్లో ఆరోపించారు. తన ఆరోపణలకు కొన్ని ఆధారాలను  కూడా కోర్టులో సమర్పించారు.

2019లో ఓడిపోయిన తర్వాత పరిణామాల్లో  చంద్రబాబుకు శ్రవణ్ అత్యంత సన్నిహితంగా మారిపోయారు. అందుకని ఫైబర్ గ్రిడ్ కేసును అసలు పట్టించుకోలేదు. ఆ కేసులోని అంశాలనే ఇపుడు ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యిందట. అలాగే ఫైబర్ స్కామ్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా శ్రవణ్ కు సాక్షిగా మార్చుకోవాలని కూడా అనుకుంటున్నది. ఈ స్కామ్ కోర్టులో విచారణకు వచ్చినపుడు శ్రవణ్ ను విచారణకు పిలిపించాలని సీఐడీ అనుకుంటున్నదట. ఆల్రెడీ ఆధారాలంటు కొన్ని డాక్యుమెంట్లను శ్రవణే కోర్టుకి ఇచ్చారు కాబట్టి ఇపుడు వాటిని కాదనలేరు. ఈ రకంగా శ్రవణ్ సాక్ష్యంతోనే చంద్రబాబును కేసులో బుక్ చేసేయాలని సీఐడీ ప్లాన్ చేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: