చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటం కోసం ఎల్లోమీడియా ఏ స్ధాయికి అయినా దిగజారుతుందనటంలో సందేహంలేదు. తాజాగా చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై సీఐడీ కేసులు నమోదుచేసింది. అప్పటి గనులశాఖ మంత్రి పీతల సుజాతను ఏ 1గా, చంద్రబాబు ఏ2, మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఏ3, మాజీమంత్రి దేవినేని ఉమ ఏ 4గా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ సీఐడీ పెట్టిన కేసు ఏమిటంటే ఉచితం పేరుతో ఇసుకను టీడీపీ వాళ్ళే యధేచ్చగా అక్రమంగా దోచేసుకున్నారని. దానివల్ల ఖజానాకు భారీ నష్టం జరిగిందని.
దోపిడిలో భాగంగా ప్రభుత్వానికి అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విధించిన జరిమానా, ఇసుక అక్రమవ్యాపారాన్ని అడ్డుకున్నందుకు అప్పటి ఎంఆర్వో వనజాక్షిపై చింతమనేని దౌర్జన్యం తదితరాలను సీఐడీ ఉదహరించింది. ఇందులో ఎలాంటి తప్పులేదు లేదా అంతా వాస్తవమే. ఇసుకను తమ్ముళ్ళు భారీఎత్తున దోచుకున్నది కూడా వాస్తవమే. అయితే తాజా కేసులో చంద్రబాబు ఇరుక్కోవటం ఖాయమన్న టెన్షన్ ఎల్లోమీడియాలో మొదలైనట్లుంది. అందుకనే కేసు స్వరూపాన్నే తమకు అనుకూలంగా మార్చుకుని ఎదురుదాడి మొదలుపెట్టింది ఎల్లోమీడియా.
ఎలాగంటే రాష్ట్రానికి మేలుచేసినా నేరమే అని, ఇసుకను ఉచితంగా ఇచ్చినా నేరమే అనే హెడ్డింగులతో పెద్ద కథనాలు అందించింది. ఇక్కడ విషయం ఇసుకను ఉచితంగా ఇవ్వటంకాదు. ఉచితం ముసుగులో జరిగిన వేల కోట్లరూపాయల దోపిడీ. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకను కొందరు మంత్రులు, కొందరు ఎంఎల్ఏలు యధేచ్చగా దోపిడీ చేశారని ఎల్లోమీడియానే ప్రముఖంగా కథనాలు ఇచ్చింది. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ, ఎంతెంత దోపిడీ జరిగింది, ఏ మార్గంలో తమిళనాడు, తెలంగాణాకు ఇసుకను తరలిస్తున్నారనే విషయాలను మ్యాపులతో సహా వివరించింది.
నిజానికి ఇసుక దోపిడీపై ఎల్లోమీడియా కథనాలు ఎందుకిచ్చిందో ఎవరికీ అర్ధంకాలేదు. పైకి మాత్రం ఇసుకను చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ ఉచితం మాటున వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందన్నది సీఐడీ ఆరోపణ. సీఐడీ ఆరోపణలను చిన్నదిగా చేసి ఇసుకను ఉచితంగా ఇచ్చినా నేరమేనట, అక్రమాలు జరిగాయని తప్పుడు కేసులు పెట్టడం ఏమిటంటు ఎల్లోమీడియా గోల మొదలుపెట్టింది. అంటే జనాలను మిస్ గైడ్ చేస్తోందన్న విషయం అర్ధమైపోతోంది. ఏ స్ధాయిలో ఇసుక అక్రమదోపిడి జరగకపోతే ఎన్జీటీ ప్రభుత్వానికి రు. 100 కోట్ల ఫైన్ వేస్తుంది ? చింతమనేని ఎంఆర్వోను అందరిముందు జుట్టుపట్టుకుని కొట్టారనే విషయాలను మాత్రం ఎల్లోమీడియా ప్రస్తావించటంలేదు.