సరిగ్గా పోలింగుకు ముందు కేంద్ర ఎన్నికల కమీషన్ కేసీయార్ కు పెద్ద షాకిచ్చింది. రైతుబంధు పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ రద్దుచేసింది. నాలుగు రోజుల క్రితం పథకం అమలుకు ఇచ్చిన అనుమతిని కమీషన్ తాజాగా రద్దుచేసింది. అప్పుడు పథకం అమలుకు ఎందుకు అనుమతిచ్చిందో మళ్ళీ ఎందుకు రద్దుచేసిందో కమీషనే చెప్పాలి.





అనుమతి ఇవ్వటంలోను, రద్దుచేయటంలోను ఏమైనా రాజకీయం ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ కు లాభం చేయటానికి కమీషన్ రెండు విధాలుగా డ్రామాలు ఆడిందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రైతుబంధు పథకం అమలుకు అనుమతి ఇవ్వాలంటు కేసీయార్ ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు. దాన్ని కొద్దిరోజులు అట్టేపెట్టుకున్న కమీషన్ చివరకు అనుమతించింది. దాని ప్రకారం 28వ తేదీ సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలి.





పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం వేస్తున్న డబ్బుల పథకాన్నే రైతుబంధు అని అంటున్నారు. పథకంలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతుల్లో  ప్రభుత్వం డబ్బులు వేయాలి. ఒకవైపు కేటీయార్ ఏమో రైతుబంధు పథకం అమలుకు కమీషన్ అనుమతి అవసరమే లేదంటున్నారు. ఇంకోవైపు కేసీయార్ ఏమో పథకం అమలుకు కమీషన్ అనుమతి కోరుతు లేఖ రాశారు. ఇక్కడే వీళ్ళ డబల్ గేమ్ బయటపడింది. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబ్టటే అనుమతి పేరుతో కేసీయార్ కమీషన్ కు లెటర్ రాశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.





రైతుల ఖాతాల్లో వేయటానికి ప్రభుత్వం దగ్గర  డబ్బులు లేవని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకనే కేసీయార్+బీజేపీ కలిసి డ్రామాలాడుతున్నట్లు రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు. డబ్బులు లేవన్న విషయాన్ని అంగీకరించకుండా పథకం అమలును నిలిపేయాలని కమీషన్ కు కాంగ్రెస్ లేఖ రాసిందని గోలచేస్తున్నట్లు రేవంత్ మండిపడుతున్నారు. కమీషన్ అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి రద్దుచేయటంలో కేసీయార్ డ్రామా ఉందని రేవంత్ పదేపదే చెబుతున్నారు. మరి దీన్ని రైతులు ఎలా చూస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: