చివరకు జనసేన పరిస్ధితి ఇలాగైపోయింది. బలంకాదు తెలంగాణాలో అసలు ఏమాత్రం ఉనికిలో కూడా లేని జనసేనను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లోకి దింపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 సీట్లు తీసుకుని అభ్యర్ధులను పోటీలోకి దింపారు. ఇపుడేమైందంటే బీజేపీనే ఎవరు పట్టించుకోవటంలేదు. అలాంటిది బీజేపీకి తోకపార్టీలాగ తయారైన జనసేనను ఎవరు పట్టించుకుంటారు ? మొదటినుండి సర్వే సంస్ధలు బీజేపీకి సింగిల్ డిజిట్ దక్కితే చాలా ఎక్కువన్నట్లుగానే జోస్యాలు చెబుతున్నాయి.
బీజేపీ గెలుచుకోబోయే సింగిల్ డిజిట్ కూడా అత్యధికమైన తొమ్మిది సీట్లను కూడా ఇవ్వలేదు. అతికష్టంమీద 4 లేదా 5 సీట్లలో గెలిస్తే చాలా ఎక్కువన్నట్లుగానే చెప్పాయి. అప్పుడు చెప్పినట్లుగానే ఇపుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అలాగే ఉన్నాయి. మీడియా, సర్వే సంస్ధలు దాదాపు 20 వరకు ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదలచేశాయి. వీటిల్లో ఏ ఒక్కటి కూడా బీజేపీకి 10 సీట్లు వస్తాయని చెప్పలేదు. బీజేపీకే దిక్కులేకపోతే ఇక జనసేనను ఎవరు పట్టించుకుంటారు.
అందుకనే జనసేన గురించి ఏ మీడియా, సర్వే సంస్ధ కూడా పట్టించుకోలేదు. గ్రౌండ్ లెవల్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పోటీచేసిన ఎనిమిది సీట్లలోను జనసేనకు డిపాజిట్లు దక్కితే అదే చాలా ఎక్కువట. తెలంగాణాలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన ప్రభావం తొందరలో జరగబోయే ఏపీ ఎన్నికల మీద కూడా పడటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణాలో జనసేన డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోవటాన్ని తమ్ముళ్ళు ఏపీలో పెద్ద మైనస్ గా చూపిస్తారు.
ఏపీ ఎన్నికల్లో పొత్తులో సీట్ల బేరమపుడు ఈ విషయం తప్పకుండా చంద్రబాబునాయుడు ప్రస్తావనకు తెస్తారు. దాంతో ఏపీలో సీట్ల బేరంలో బార్గైనింగ్ కెపాసిటిని పవన్ తనంతట తానుగానే తగ్గించుకున్నట్లవుతుంది. మొత్తానికి సీమాంధ్ర ఓట్లు ప్రధానంగా కమ్మోరి ఓట్లను జనసేనకు కాకుండా కాంగ్రెస్ వైపు మళ్ళేట్లు చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. దీని ప్రభావం ఏపీ ఎన్నికల్లో కాపుల ఓట్లు టీడీపీకి మళ్ళించే విషయంలో పవన్ సమస్యలు ఎదుర్కోవటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో క్లారిటి రావాలంటే 3వ తేదీవరకు వెయిట్ చేయాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి