ఇప్పటికే ఎన్నికల ముందు గృహలక్ష్మి అనే అమలు చేసిన గత ప్రభుత్వం ఏకంగా ఇక ఈ పథకానికి సంబంధించి అని ఏర్పాట్లు పూర్తి చేసి అర్హులకు ఇప్పటికే సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది. దీంతో ఎంతోమంది ఇక ఉన్న ఇల్లు పూర్తిగా కూలగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి షాక్ ఇచ్చింది. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇక ఈ పథకం కింద డబ్బులు వస్తాయి తమ సొంత ఇంటి కల నెరవేరుతుంది అనుకున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వమే ఊరించి ఊరించి గృహ లక్ష్మీ పథకాన్ని అమలు చేసింది.
ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా అని ఉన్న ఇల్లు కూలగొట్టుకుని కొత్త ఇల్లు ప్రారంభిస్తే.. ఈ పథకాన్ని రద్దు చేశారు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొత్త ఇల్లు కట్టుకోవడానికి అభయహస్తం పథకాన్ని అయినా త్వరగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరగా అమలు చేయకపోతే.. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని నమ్ముకుని ఇల్లు కూలగొట్టుకున్న సామాన్యుల బ్రతుకులు మరింత గందరగోళంగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుపేద ప్రజలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి