సుదీర్ఘ కసరత్తు, అనేక భేటీల తర్వాత టీడీపీ+జనసేన కూటమి తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల మొదటిజాబితా రెడీ అయినట్లు సమాచారం. తొలిజాబితాలో 70 మంది అభ్యర్ధులు ఉండబోతున్నారట. ఈ జాబితాలో 50 మంది టీడీపీ, 20 మంది జనసేన అభ్యర్ధులు ఉండబోతున్నట్లు కూటమి వర్గాలు చెప్పాయి. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని గతంలోనే చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే ఇందులో రాజమండ్రి రూరల్, పెద్దాపురం నియోజకవర్గాల అభ్యర్ధుల విషయం అయోమయంలో పడింది.
టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాలను జనసేన కోరుకుంటోంది. పైగా పై నియోజకవర్గాల్లో నేతలు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దాంతో రెండుపార్టీల మధ్య గందరగోళం ఉంది. జనసేన నేతలేమో 60 సీట్లకు తగ్గకుండా పోటీచేయాలని పట్టుబడుతున్నారు. పవన్ మద్దతుదారుడు, మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య 60 సీట్లలో పోటీచేయకపోయినా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రెండున్నర సంవత్సరాలు పవన్ కు ప్రకటించకపోయినా కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవటం కష్టమని చెప్పారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబుతో భేటీ అయినపుడు పవన్ 50 సీట్లు కావాలని ఒక జాబితా ఇచ్చారని సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం 25 అసెంబ్లీలు, 3 పార్లమెంటు నియోజకవర్గాలు కేటాయిస్తామని చెప్పారట. అంటే జనసేన శ్రేణుల డిమాండుకు చంద్రబాబు ప్రతిపాదనకు మధ్య చాలా వ్యత్యాసముంది. ఈ అంతరాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో తెలీదు. మొత్తానికి మొదటిజాబితాను ప్రకటించాలని మాత్రం ఇద్దరూ డిసైడ్ అయ్యారట. అభ్యర్ధులను ప్రకటించేస్తు జగన్మోహన్ రెడ్డి దూకుడు మీదున్న విషయం తెలిసిందే. జగన్ స్పీడుగా ఉన్నపుడు తాము మాత్రం చర్చల్లోనే ఉంటే జరగబోయే డ్యామేజిపై ఇద్దరు మాట్లాడుకున్నారట.
ఈనెలలోనే అంటే 18-21 తేదీల మధ్య రెండుపార్టీలకు ఇబ్బందుల్లేని నియోజకవర్గాలను మొదటిజాబితాగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారట. అందుకనే 70 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా రెడీ అవుతోందని సమాచారం. పనిలోపనిగా అసెంబ్లీ మొదటిజాబితాతోనే 7 లేదా 8 పార్లమెంటు సీట్ల ప్రకటన కడా ఉంటుందని అంటున్నారు. 70 మంది జాబితా ఇదే అని సోషల్ మీడియాలో ఒక లిస్టు చక్కర్లు కొడుతోంది. దాంతో రెండువైపుల నేతల్లో టెన్షన్ మొదలైంది. అధికారికంగా జాబితాను విడుదల చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని అనుకున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి