ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు చివరకు ఎంత గతిపట్టింది ? పొత్తుల కోసం పార్టీలను బతిమలాడుకునే పరిస్ధితిలో కూరుకుపోయారు. వచ్చేఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలి ? అయితే ఎలా ఓడించాలో అర్ధంకావటంలేదు. అందుకనే ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటపడి వెంటపడి పొత్తుకు ఒప్పించారు. అదే సమయంలో బీజేపీతో ప్రయత్నించినా కుదరదు పొమ్మన్నది.
అయితే బతిమలాడుకుని, బతిమలాడుకుని కమలంపార్టీలో ఉన్న తన మనుషులతో పెద్దలకు చెప్పించి చెప్పించి చివరకు మాట్లాడటానికి రమ్మని కబురు వచ్చేట్లు చేసుకున్నారు. బుధవారం రాత్రికి ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ ఉంది. ఎన్నిసీట్లు అడిగితే అన్ని సీట్లను బీజేపీకి ఇవ్వటానికి చంద్రబాబు మెంటల్ గా ఫిక్సయిపోయారట. సీట్లను వదులుకోవటం కాదు అసలు బీజేపీ పొత్తుకు ఒప్పుకోవటమే చాలా పెద్ద అచీవ్మెంట్ గా చంద్రబాబు భావిస్తున్నారు.
అందుకనే కమలనాదులు అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పటంలేదని తమ్ముళ్ళతో జరిగిన మీటింగులో చెప్పారు. అసలు బీజేపీ పెద్దలే చంద్రబాబును కలవాలని అనుకున్నారా లేకపోతే చంద్రబాబు రిక్వెస్టు ప్రకారం మాట్లాడుదాం రమ్మని చెప్పారా అన్నది తేలలేదు. ఎందుకంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా ఎల్లోమీడియా కలరింగ్ ఇచ్చింది. అంటే జరుగుతున్నదానికి పూర్తిగా ఎల్లోమీడియా రివర్సులో రాస్తోందనే అనుకోవాలి. ఎల్లోమీడియా కథనం ప్రాకరమైతే బీజేపీ 15 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లను అడుగుతోందని సమాచారం.
మరి ఇందులో చంద్రబాబు ఎన్నింటికి అంగీకరిస్తారో తెలీదు. తాము అడిగినన్ని సీట్లను ఇవ్వకపోతే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ సాధించబోయేదేమీ లేదు. అలాగే ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చే నష్టమూలేదు. అరకు, విశాఖపట్నం, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, రాజంపేట, ఏలూరు, కాకినాడలో ఏడు పార్లమెంటు సీట్లను బీజేపీ అడుగుతోందని సమాచారం. మరి చంద్రబాబు ఏమంటారో చివరకు పొత్తు చర్చలు ఏమవుతాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి