ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడున్న వ్యవహారం అని అందరికీ తెలిసిందే.  అందుకనే అన్నీ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో ఇతర విషయాలతో పాటు ఆర్ధిక పరిస్ధితికి చాలా ప్రాధాన్యతిస్తాయి. అభ్యర్ధికి మంచివాడనే పేరున్నా డబ్బులేదంటే ఎందుకు పనికిరాడు. అందుకనే డబ్బున్న నేతలకే  అభ్యర్ధులుగా టాప్ ప్రయారిటి ఇస్తుంటాయి. కానీ ఇపుడు వైసీపీలో జరుగుతున్న తంతును చూస్తుంటే మామూలు జనాలకే కాదు చంద్రబాబునాయుడుకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏమిటో అర్దమవుతున్నట్లు లేదు.





టికెట్ కోసం ఎంతోమంది ఎన్నోరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నా కొన్ని నియోజకవర్గాల్లో నియమించిన ఇన్చార్జిలను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటివరకు 70 నియోజకవర్గాల్లో జగన్ అభ్యర్ధులను(ఇన్చార్జిలు) ప్రకటించారు. 25 నియోజకర్గాల్లో కొత్తవారిని ఎంపికచేస్తే మిగిలిన వారికి నియోజకవర్గాలను మార్చారు. మడకశిర, శింగనమల, కందుకూరు, మైలవరం, నెల్లూరు, నరసరావుపేట పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు మరికొన్ని చోట్ల ఎంపికలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే పై నియోజకర్గాల్లో బలమైన నేతలు టికెట్ల కోసం ప్రయత్నిస్తే వాళ్ళని కాదని కొత్తవారిని ఎంపికచేశారు.





మడకశిర, శింగనమలలో అభ్యర్ధులుగా ఎంఎల్ఏలను కాదని ఎంపికైన ఎస్సీ అభ్యర్ధుల ఆర్ధికపరిస్ధితి చాలా సాధారణమైంది. తాము ఎన్నికల్లో పోటీచేస్తామని వీళ్ళసలు అనుకుని కూడా ఉండరు. అలాంటిది వీళ్ళని పిలిచి జగన్ మరీ టికెట్లిచ్చారు. అలాగే కందుకూరులో ఎంఎల్ఏ మానుకోట మహీధర్ రెడ్డిని కాదని అరవిందా యాదవ్ ను ఎంపికచేశారు. నెల్లూరులో అనీల్ కుమార్ యాదవ్ స్ధానంలో ఖలీల్ అహ్మద్ ను పికప్ చేశారు. ఇక గాజువాకలో వైజాగ్ కార్పొరేటర్ను ఎంపికచేశారు. అయితే టీడీపీ కూటమిని ఎదుర్కొనేందుకు కార్పొరేటర్ నేపధ్యం సరిపోదనే చర్చ జరుగుతోంది.





అలాగే మైలవరంలో కూడా కొత్త ముఖాన్నే ఎంపికచేశారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో కొత్తవారిని ఎంపికచేశారు. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏమిటంటే అత్యధికులు యువకులు, ఆర్ధిక నేపధ్యం బలంగా లేనివారు, ముఖ్యంగా బడుగు, బలహీన, మైనారిటి వర్గాల వాళ్ళే. చంద్రబాబు, పవన్ ఏమో అభ్యర్ధులుగా బాగా డబ్బున్న వాళ్ళను చూస్తుంటే జగనేమో సామాజికవర్గాల సమీకరణలు, యువత, లాయల్టీ, వ్యక్తిగత ఇమేజీలకు ప్రాదాన్యతిస్తున్నారు. ఇక్కడే జగన్ వ్యూహాలేమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: