టిడిపి జనసేన అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతూ ఉండడంతో రెండు పార్టీల మధ్య రోజుకి అసహనం పెరిగిపోతూనే ఉంది.చాలామంది నాయకులు సైతం అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అసలు టిడిపి జనసేన మధ్య పొత్తు పైకి కనిపించినంతగా సాఫీగా లేదని అంతర్గతంగా ఎన్నో అపసోపాలు పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తు ధర్మం పాటించాలంటూ టిడిపి జనసేన పార్టీలు రెండు కూడా ఎవరికి వారు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నారు. ఓకే సీటు పైన రెండు పార్టీల పట్టు వదలకుండా చేయడం పైన పలు రకాల సందేహాలు కూడా రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి.


జనసేన టిడిపి పార్టీల మధ్య పొత్తుపొడిచి ఐదు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కార్యకర్తలలో గందరగోళం కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో తాము గెలిచాలంటూ ఇరువురు పార్టీ నేతలు కూడా త్యాగాలు చేయాలంటూ ప్రచారం జోరు అందుకుంది పొత్తు కాయమే అయినప్పటికీ ఇందులో ఎవరికి సీటు ఇస్తారనే విషయం పైన క్షేత్రస్థాయిలో ఏదో ఒక గందరగోళం మొదలవుతూనే ఉంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు జనసేన నేత పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు పైన అవగాహన కుదుర్చామంటూ చెబుతున్నప్పటికీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.

జనసేనకు 25 సీట్లు కేటాయిస్తారని వార్తలైతే వినిపిస్తున్నాయి.మరో 40 నుంచి 50 రోజులలో ఎన్నికలు జరుగుతాయని విధంగా ఇంకా జనసేన పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందని విషయం పైన అసలు అవగాహన లేకపోవడంతో పాటు మధ్యలో బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకునే విధంగా ప్రచారం చేస్తూ ఉండటంతో అటు టిడిపి నేతలు జనసేన నేతలు బిజెపి నేతలు చాలా గందరగోళంగా మారుతోంది. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించడంతో ఎవరికి నచ్చిన నచ్చకపోయినా ఇది పాటించాల్సిందే అంటే చాలా గట్టిగానే హెచ్చరించారు. దీంతో టిడిపి పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కి గౌరవం ఇస్తామని స్నేహ గీతాన్ని అలరించింది


గత కొద్దిరోజులుగా చూస్తే పొత్తు వ్యవహారం కాస్త బెట్టు చేసినట్టుగా కనిపిస్తోంది. అటు సీట్ల విషయంలో మేనిఫెస్టో విషయంలో ఏఏ స్థానాలలో ఎవరు నిలబడతారు అనే విషయం పైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో పైకి పొత్తులు కనిపిస్తున్న లోపల కత్తులు పొడుస్తున్నాయి అంటే పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: