జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయవలసింది అంటూ పలువురు నాయకులకు సూచనలు ఇచ్చారు. అంతేకానీ జీరో బడ్జెట్ పొలిటికల్స్ తో వర్కౌట్ కావడంటూ కూడా తెలియజేశారు. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అంటూ కూడా చాలామంది తమను ప్రశ్నిస్తున్నారు అంటూ తెలిపారు.. ఇటీవల భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలవేళ జనసేన అటు టిడిపి నేతలు ఆశ్చర్యపరిచేలా పలు రకాల వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ తమను చూసి ఎవరు ఓట్ వేయరని ఉద్దేశంతోనే రాజకీయాలంటే కచ్చితంగా డబ్బు ఖర్చు చేయాల్సిందే అన్నట్టుగా తెలియజేశారు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన బిజెపి పొత్తు కోసం తన ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానంటూ తెలిపారు. అయితే ఈసారి ఎన్నికల్లో చాలా రసవత్తంగా మారేలా కనిపిస్తున్నాయి.. నాయకులందరకు పదేపదే చెబుతున్నారు పవన్ కళ్యాణ్ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే వీటితోపాటు బాగా పని చేయాల్సిందే అంటు తెలిపారు.


చాలామంది కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు తాను ఈ విషయంలో ఏ విధంగా మాట్లాడాను.. సీట్లు ఎవరైతే త్యాగం చేస్తారో వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని ఎవరికీ చెప్పలేదు అంటూ తెలిపారు.. మనలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్న మన పార్టీ నేతలు త్యాగాలు చేయాల్సిన అవసరం వచ్చింది.. మీరంతా టిడిపికి ఓటు వేస్తే.. మన ప్రభుత్వం వస్తుందంటూ తెలిపారు. మనలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్న మన పార్టీ నేతలు వాటిని వదిలిపెట్టాలి అంటూ సూచించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కష్టాలలో ఉంది.. జనసేన కూడా గత ఎన్నికలలో ఓడిపోయింది.. ఓడిపోయిన మనం కష్టాల్లో ఉన్న టిడిపికి సహాయం అందిస్తున్నామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: