కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం గత కొద్దిరోజులుగా జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్తలైతే వినిపించాయి. ఆయన కుమారుడు కూడా గిరి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వాలని ముద్రగడ కండిషన్ విధించడంతో త్వరలోనే జనసేనలో చేరబోతున్నారని ప్రచారం బాగా జరిగింది.. ఈ విషయం పైన పవన్ కూడా కాస్త సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. టిడిపి వైసిపి లోకి వెళ్లే ప్రసక్తే లేదంటూ కూడా ముద్రగడ కూడా తెలియజేశారు. అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వెళ్లి మరి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ వార్తలైతే వినిపించాయి.


అయితే ఈ విషయం జరిగి ఇప్పటికీ నెల పైనే కావస్తున్న అందుకు సంబంధించి ఎక్కడ కూడా చర్చించిన ఫలితాలు అధికారికంగా వెల్లడించలేదు.. తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన ముగిసింది కానీ ముద్రగడ పద్మనాభవం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టుగా ఎక్కడ వార్తలు వినిపించలేదు. దీనిపై ముద్రగడ కూడా పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా వార్తలు వినిపించాయి. ముద్రగడను చేర్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా లేరని తమ పార్టీలో చేర్చుకుంటే ఆయన పెట్టే డిమాండ్లు తనకి చాలా ఇబ్బందులుగా మారుతాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా ఉన్నట్టు జనసేన వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.


నిజానికి ముద్రగడ పద్మనాభం వైసిపి పార్టీలో చేరుతారని అందరూ అనుకున్నారు.కానీ ఆయనకు ఆయన కుమారుడుకు టికెట్ విషయంలో జగన్ కూడా అంత సానుకూలంగా చూపించకపోవడంతో ఆ పార్టీ పైన ఆగ్రహంతోనే జనసేనలోకి చేరాలని నిర్ణయించుకున్నారట.కానీ ఇప్పుడు పవన్ కూడా ముద్రగడను పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం ముద్రగడ రాజకీయాలను డైలమాల పడేసేలా చేసింది. టిడిపితో జనసేన పొత్తు కొనసాగించిన నేపథ్యంలో ముద్రగడను చేర్చుకుంటే టిడిపిలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని పవన్ భావించడంతో ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ సైలెంట్ అయినట్టుగా అర్థమవుతోంది. మరి రాబోయే రోజుల్లో పొలిటికల్ ఎంట్రీ పై ముద్రగడ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: