జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని స్టార్ కామెడీగా కొనసాగుతున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.ఈ టాలెంట్ తోనే పలు రకాల సినిమాలలో కూడా అవకాశాలు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజీను అందుకున్నారు.. పొలిటికల్ పరంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి జనసేన పార్టీలోకి చేరారు హైపర్ ఆది.. ఇక సినిమాలలో చేస్తూనే మరొకపక్క డైలాగు రైటర్ గా మారి తన సత్తా చాటుతూ ఉన్నారు. జనసేన కార్యకర్తగా స్టేజ్ పైన ఎన్నో ప్రసంగాలు చేసి ఎంతోమందిని సైతం విమర్శిస్తూ ఉన్నారు.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. తాజాగా హైపర్ ఆది ఎమోషనల్ అవుతూ టిడిపి జనసేన పొత్తులో జనసేనకు 24 సీట్లు ఇవ్వడం పై పవన్ అభిమానులే కాదు హైపర్ ఆదిను కూడా తిట్టిపోస్తున్నారు ఈ విషయంపై హైపర్ ఆది ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది.. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే రకం కాదంటూ సినిమాలు చేస్తే కోట్లు సంపాదించుకోవచ్చు అంటూ ప్రజల కోసమే తాను పోరాడుతున్న వ్యక్తి అంటూ తెలియజేశారు..


పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే చాలా బాధగా అనిపిస్తుంది.. అసలు 24 సీట్లు ఏంటి అదేంటి అంటూ మాట్లాడుతున్నారు. 2019లో కనీసం ఆయనను గెలిపించుకోలేకపోయాము ఆయన అడిగే హక్కు ఎవరికీ లేదు అంటూ తెలుపుతున్నారు.తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బులు కూడా తీసి రైతుల కష్టాలను తీర్చారు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఎన్నో సమస్యలను కూడా పరిష్కారం చేస్తారంటూ తెలిపారు.. రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తినీ..చాలామంది కులాన్ని తాకట్టు పెట్టాడు పార్టీని తాకట్టు పెట్టాడు ప్యాకేజీ తీసుకున్నారని అంటున్నారు.. ఈ విషయాలన్నీ విని చాలా బాధేస్తుంది అంటూ తెలిపారు హైపర్ ఆది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: