ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాల పైన ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాలను తెలియజేస్తూ ఉంటారు సిబిఐ మాజీ జె డి వివి లక్ష్మీనారాయణ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కొత్త రాజకీయ పార్టీని కూడా ఆవిర్భవించారు.. జై భారత్ నేషనల్..(JBNP) పేరిట ఒక పార్టీని కూడా ప్రకటించారు . గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పార్టీ పేరును సైతం ఆయన ప్రకటించారు.. అప్పటినుంచి పొలిటికల్ పరంగా చురుకుగా పాల్గొంటున్న జెడి లక్ష్మీనారాయణ ఇప్పుడు తాజాగా టిడిపి, జనసేన పార్టీ పొత్తుల పైన పలు షాకింగ్ విషయాలను తెలియజేశారు..


గత శనివారం రోజున టిడిపి జనసేన పార్టీ అభ్యర్థులను తొలి జాబితా ప్రకటించడంతో అనంతరం వీరి పొత్తుల పైన చాలా తీవ్రమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మాజీ జెడి లక్ష్మీనారాయణ టిడిపి ,జనసేన పొత్తుల పైన పలు వ్యాఖ్యలు చేశారు రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా కూడా జరగవచ్చు.. జనసేన టిడిపి తో పొత్తు నుంచి బయటికి వచ్చి మరి బిజెపి పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందంటూ ఆయన తెలియజేశారు. అయితే ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.జనసేన సైనికులకు మాత్రం ఈ విషయం కాస్త ఆనందాన్ని కలిగించేలా కనిపిస్తోంది. ఎందుకంటే తమ పార్టీని నమ్ముకొని దాదాపుగా పదేళ్ల పాటు పనిచేస్తున్న వారందరికీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇలా జరుగుతేనే బాగుంటుందని భావిస్తున్నారు.. లక్ష్మీనారాయణ గారు పార్టీని పెట్టినప్పటినుంచి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడుతూ అన్ని పార్టీలు ఇందులో విఫలమయ్యాయని ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు తమ పార్టీ ఆవిర్భవించామంటూ తెలిపారు..  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో కొత్త పార్టీ ప్రారంభించామని తమ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా తెలియజేశారు. మరి టిడిపి జనసేన కొత్త విషయంలో జెడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా జరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: