ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటిదాకా ప్రచారం సాగింది. అయితే ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే విషయం ఇపుడు లేటెస్ట్ గా సాగుతున్న మరో ప్రచారం.పవర్ స్టార్ ఈసారి కూడా రెండు సీట్లకు పోటీ చేస్తారన్న ప్రచారం బాగా జరుగుతుంది. అయితే ఆ రెండూ ఎమ్మెల్యే సీట్లకు కాదు, అందులో ఒకటి ఎమ్మెల్యే సీటు అయితే ఇంకోటి ఎంపీ సీటు. ఆ విధంగా రెండు సీట్లకు పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల ఫలితాల తరువాత తన రాజకీయ భవిష్యత్తుని తిరుగులేని విధంగా మలచుకోవాలని పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ఉన్నారట.ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో మూడవసారి వరసగా బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గ్యారంటీగా కేంద్రంలో మంత్రి అవుతారని అంటున్నారు.ఇంకా అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి పవర్ లోకి వస్తే అతి ముఖ్య భూమికను ఆయన పోషిస్తారని అంటున్నారు.


ఒక వేళ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిగా ఉండడం ద్వారా రాజకీయంగా తన పార్టీని అధికారం అండతో కాపాడుకోవచ్చన్న ఆలోచనలు పవన్ కళ్యాణ్ లో ఉన్నాయని అంటున్నారు. నిజానికి పవన్ కి ఈ సలహా ఇచ్చింది బీజేపీ అధినాయకత్వమని అంటున్నారు.ఇక మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ని ఎంపీగానే పోటీ చేయమని బీజేపీ కోరిందని సమాచారం తెలుస్తుంది. కానీ ఈ కీలక సమయంలో టీడీపీతో కలసి కూటమి కట్టి ముందుకు వెళ్తున్న నేపధ్యంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఆయనను అభిమానించే వారితో పాటు ఒక బలమైన సామాజిక వర్గం కూడా కూటమి గెలుపులో ఉత్సాహంగా పాలుపంచుకోదన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారని అంటున్నారు.ఇక టీడీపీ జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో ఎక్కువ సీట్లు గెలిపించుకుని తన వారికి మంత్రి పదవులు దక్కించుకుని తాను ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కావాలన్న మరో ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ కి ఉందని అంటున్నారు. అపుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సీటులో ఉప ఎన్నిక వచ్చినా ఈజీగా గెలిపించుకోవచ్చు అన్నది ఉద్దేశ్యంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: