జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన చాలా దారుణంగా ట్రోల్ కి గురైన సందర్భాలు ఉన్నాయి.. పార్టీ మొదలు పెట్టినప్పుడు టిడిపి పార్టీకి మద్దతు తెలుపుతాను అంటూ ప్రకటించడంతో పాటు.. 2019లో సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్లీ ఈసారి ఎన్నికలలో టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తానని ప్రకటించినప్పటి నుంచి ట్రోల్ కి గురవుతూనే ఉన్నారు.. అంతేకాకుండా సీట్ల విషయంలో కూడా ఇటీవలే చాలా దారుణంగా జనసేన నేతలతోనే చివాట్లు తింటున్నారు పవన్ కళ్యాణ్.

తాజాగా నటుడు త్రిపురనేని చిట్టిబాబు పవన్ కళ్యాణ్ పైన పలు వ్యాఖ్యలు చేశారు.. టిడిపి బిజెపి ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడ్డారంటూ తెలియజేశారు.. చంద్రబాబు మోడీ మధ్య పవన్ వెర్రిపప్ప అయ్యారు అంటూ ఆయన విమర్శించారు.. పవన్ ఒక్కచోట నిబద్ధతలేని వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫెయిల్ అయ్యారు అంటూ కూడా ఎద్దేవా చేశారు.. తనని నమ్ముకొని వచ్చిన జనసైనికులను అభిమానులను పలువురు నాయకులను సైతం ఇతర పార్టీకి ఊడిగం చేయించేలా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.


చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పరిస్థితి బాగా తెలుసు అని అందుకే 24 సీట్లకు మించి ఇవ్వలేదని చంద్రబాబును బిజెపి అసలు నమ్మదని.. చంద్రబాబు తప్పు చేశారు.. మంచి చేశారు అనే విషయాలు కోర్టు తేలుస్తుంది పవన్ కళ్యాణ్ కాదు కదా అంటూ చిట్టిబాబు ఎద్దేవ చేశారు.. బిజెపితో కాపురం మని టిడిపి తో సంసారం చేస్తారంటూ ఈ విషయం పైన ప్రజలు కూడా ఒక అవగాహనతోనే ఉన్నారంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శించారు చిట్టిబాబు.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడమే ముఖ్యమంత్రి వెల్లడించారు... తమను అభిమానించే వారిని ఎప్పటికీ మోసం చేయకూడదంటూ కూడా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: