క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన కూటమి పోటీచేయబోయే మొదటిజాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండుపార్టీల తరపున 99 మంది అభ్యర్ధులను అధినేతలు ఇద్దరు ప్రకటించారు. ఇందులో 94 మంది టీడీపీ తరపున, ఐదుగురు అభ్యర్ధులు జనసేన తరపున ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  మొత్తం 99 నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాలకు సంబంధించి 15 నియోజకవర్గాలను ప్రకటించారు.

ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లున్నాయి. తమ బలం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని అంచనా వేసుకున్న పవన్ జనసేనకు కేటాయించబోయే సీట్లలో దాదాపు సగం సీట్లను రెండు జిల్లాల్లోనే కావాలని  అడిగారట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఉభయగోదావరి జిల్లాల్లో 12 సీట్లను అడిగారట. అయితే తాజాగా ప్రకటించిన 15 సీట్లలో టీడీపీ తరపున 13 మంది, జనసేన తరపున ఇద్దరు మాత్రమే ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజి, రాజానగరంలో బత్తుల బలరామకృష్ణకు టికెట్లు కేటాయించారు.

అంటే ప్రకటించిన 15 సీట్లలో జనసేనకు ఇచ్చింది కేవలం రెండంటే రెండు మాత్రమే. ఇక మిగిలింది 19 సీట్లు. ఈ సీట్లలో టీడీపీ ఎన్నింటిలో పోటీచేస్తుంది ? జనసేనకు ఎన్నిస్తుందన్నది సస్పెన్సుగా  ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ప్రకటించబోయే 19 సీట్లలో జనసేనకు ఇవ్వబోయేది  మహాయితే నాలుగు సీట్లకన్నా ఉండవట. పవన్ అడిగింది 12 సీట్లయితే దక్కబోయే సీట్లు ఎక్కువలో ఎక్కువ 5 లేదా 6 మాత్రమే.

పార్టీకి బాగా బలముంది, ఓటింగ్  దాదాపు 36 శాతంకు పెరిగిందని పవన్ అనుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే దక్కబోయే సీట్లు అడిగిందానిలో సగం. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందో చూడాలి. జనసేన పోటీచేయబోయే సీట్లలో కొన్నింటిలో తమ్ముళ్ళే పోటీచేస్తారనే ప్రచారం నిజమయ్యేట్లుంది. అందుకనే జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో 19 సీట్లను ప్రకటించకుండా ఆపేశారనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీకి పెద్దగా బలంలేని కాకినాడ రూరల్, రాజానగరం సీట్లను జనసేనకు ఇచ్చారు. మరి మిగిలిన సీట్లు ఏమిస్తారో చూడాలి. అందుకనే జనసేనను చంద్రబాబు గోదావరిలో నిండా ముంచేశారనే టాక్ పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: