ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ వేదిక పైన నాగబాబు మాట్లాడుతూ 5 అడుగుల మూడు అంగుళాల ఉన్న హీరో పోలీస్ అంటే వీడు పోలీస్ ఏంట్రా బాబు అనిపించేలా కొన్ని పాత్రలు ఉంటాయని.. అయితే పోలీస్ పాత్రలు చేయాలంటే మంచి హైట్ ఉండాలంటూ కూడా కామెంట్స్ చేశారు.. అయితే ఈ కామెంట్స్ ని నాగబాబు జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించే ట్రోల్ చేశారనే విధంగా వార్తలు మొదలయ్యాయి..


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ కామెంట్స్ వినిపించడంతో పలు రకాల ఫోటోలు వీడియోలు వైరల్ గా చేస్తున్నారు. నాగబాబు ఉద్దేశ్యం ఏదైనా సరే అది పొట్టి హీరోలు అభిమానులను హార్ట్ చేసిందనే విధంగా నాగబాబు పైన తీవ్రమైన స్థాయిలో ఫైర్ అవుతున్నారు.. ఫ్యాన్స్ హైట్ ఉన్నవారు ఆర్మీ అధికారి పాత్రలకు సెట్ అవుతారని చెప్పే క్రమంలో నాగబాబు ఇలా మాట్లాడారని ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదనే వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు అయినా కూడా ఈ వివాదం మాత్రం సర్దు మునగలేదు..


నేరుగా నాగబాబునే స్వయంగా క్షమాపణలు చెప్పారు.. తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును అయితే విడుదల చేశారు. పోస్ట్ కింద ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.. ఎన్టీఆర్ పొట్టివాడని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే చరణ్ పొట్టివాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. నాగబాబు చేసిన పని వల్ల వివాదం తగ్గకపోయినా మరింత పెంచేలా కనిపిస్తోంది.. ఎన్నికల టిడిపి జనసేన పార్టీకి కూడా ఈ విషయం తలనొప్పిగా మారేలా ఉంటుంది.. నందమూరి ఫ్యాన్స్ తో జనసేన పార్టీ నాయకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో ఇలా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడితే ఎలా అంటూ పలువురు అభిమానులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: