ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రచారం మొదలు పెట్టింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని ఆ పార్టీని ముందుకు నడిపే బాధ్యతలు తీసుకుంది. తన అన్న పాలనపై ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రత్యేక హోదా నినాదంతో పాటు జనాకర్షక పథకాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం గాను విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇంకా ఇతర ముఖ్యనేతలు సమావేశమయ్యారు.


రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు నేతలు. ఎన్నికల్లో వామపక్షాలతో  కలవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. పొత్తులు ఏ విధంగా ఉండాలి.. పొత్తుల్లో భాగంగా ఏయే స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చర్చ జరిగింది.అసలు ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆ పార్టీ ఎప్పుడూ కూడా ఈ విషయం పదే పదే చెబుతోంది. ఇక ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి కూడా రూ. 5 వేలు ఇస్తామనే హామీని కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ కీలక భేటీకి కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పల్లంరాజు, జేడి శీలం, తులసి రెడ్డి ఇంకా అలాగే రుద్రరాజు సహా ఇతర నేతలు హాజరవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: