రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి బీఆర్ఎస్  నేతలు భయపడుతున్నారా ? తాజాగా కేసీయార్ నిర్వహించిన సమీక్షలోనే ఈ విషయం బయటపడిందని పార్టీవర్గాల సమాచారం. చేవెళ్ళ పార్లమెంటు సీటులో ఎవరు పోటీచేయాలనే విషయమై కేసీయార్ నేతలతో చర్చించారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మళ్ళీ పోటీచేస్తారు కాబట్టి ఆయన గెలుపుకు నేతలందరు సహకరించాలని కేటీయార్ రెండురోజుల క్రితమే చెప్పారు. అయితే ఊహించని విధంగా రంజిత్ రెడ్డి తాను పోటీచేసే విషయంపై తొందరలోనే  నిర్ణయాన్ని బుతానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  

తనకు బదులుగా కొత్త అభ్యర్ధిని ఎంపికచేయమని కేసీయార్ తో పాటు కేటీయార్ కు కూడా సూచనప్రాయంగా ఎంపీ చెప్పారట. దాంతో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న నేతలను ఎంపికచేసేందుకు కేసీయార్ సమీక్షించారు. అయితే సమీక్షలో పాల్గొన్న నేతలు ఎవరూ పోటీచేయటానికి ముందుకురాలేదట. ఇంతకీ రంజిత్ రెడ్డి ఎందుకు పోటీకి వెనకాడుతున్నట్లు ? ఎందుకంటే పెట్టాల్సిన భారీ ఖర్చులను తలచుకునే రంజిత్ వెనకాడుతునట్లు సమాచారం. రంజిత్ మాత్రమే కాదు చాలామంది నేతలు ఎంపీగా పోటీచేయటానికి వెనకాడుతున్నారట. ఖర్చులు భారీఎత్తున చేయాల్సొస్తుందని, ఒకవేళ అంత ఖర్చుపెట్టినా గెలుపు గ్యారెంటీ లేదని అనుమానిస్తున్నారట.

టికెట్ రాదన్న అనుమానంతోనో  లేకపోతే బీఆర్ఎస్ తరపున పోటీచేయటం ఇష్టంలేకో ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ పీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. అలాగే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమిస్తుంటే బీఆర్ఎస్ తరపున ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు వెనకాడుతున్న విషయం అర్ధమవుతోంది.

మరీ పరిస్ధితుల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఎవరిని ఎంపికచేయాలనే విషయం కేసీయార్ కు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయాలంటే భారీగా ఖర్చులు చేయాల్సిరావటం మాత్రం వాస్తవం. ఇంత ఖర్చుచేసినా గెలుపు ఖాయమా అంటే అనుమానమనే అకుంటున్నారట. ఈ పరిస్ధితుల్లో ఎవరిని పోటీచేయమని కేటీయార్ అడుగుతున్నా సీనియర్లు వెనకాడుతున్నారట. దాంతో కొత్త నేతలను కేసీయార్ ఎంపీలుగా పోటీలోకి దింపాల్సుంటుంది. అలాగే ఖర్చుల విషయంలో పార్టీనే హామీ ఇవ్వాల్సుంటుంది. మరీ పరిస్ధితుల్లో ఎంతమంది గట్టినేతలు పోటీలోకి దిగుతారనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: