మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే లంచాలు అనేవి తీసుకోవడం చాలా నేరము.. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాటిని తీసుకోకుండా ఉండలేకపోతున్నారు.. ఇలాంటి వారిని పట్టుకునేందుకు acb లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా లంచాలు తిని రాజకీయ నాయకులను కూడా పట్టుకునేందుకు ఇలాంటి వ్యవస్థలు మాత్రం లేవు... అందుకే రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో ఇష్టానుసారంగా అడ్డగోలుగా సంపాదిస్తూ ఉంటారు.. ఇలాంటి నేపథ్యంలోని ఎంపీ ఎమ్మెల్యేలకు సైతం లంచం కేసులో ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ సుప్రీంకోర్టు నిన్నటి రోజున పలు కీలకమైన తీర్పును తెలియజేశాయి.


నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి కేసులే.. ఈ మధ్య పార్లమెంటులో పలు రకాల ప్రశ్నలు అడిగినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పైన పలు రకాల ఆరోపణలు వినిపించాయి.. సుప్రీంకోర్టు నిన్నటి రోజున సంచలన తీర్పు తెలియజేయడంతో ఒకరకంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాస్త శాక్ తగిలిందని చెప్పవచ్చు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రు చూడ్ మరి కొంతమంది ఏడుగురు సభ్యుల తో నిన్నటి రోజున ఎంపీ ఎమ్మెల్యేల లంచం కేసు పైన కీలకమైన తీర్పుని వెల్లడించారు.


లంచం తీసుకొని ఎవరు భారతీయ ప్రజాస్వామ్యాన్ని సైతం నాశనం చేయకూడదని సుప్రీంకోర్టు ప్రకటించింది.. లంచం తీసుకొని మరి శాసనసభ లేదా లోక్సభల్లో మాట్లాడడం సరైన పద్ధతి కాదంటూ కూడా తెలియజేయడంతో పాటు ఇలా లంచం తీసుకొని మరి ఓటు వేయడం సరైన చర్య కాదంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది.. ముఖ్యంగా శాసన అధికారులు సైతం కచ్చితంగా ఎమ్మెల్యేలు ఎంపీలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అధికారం అంటే అడ్డగోలుగా వ్యవహరించడం కాదని.. అలాంటి వారికి చట్టసభ కూడా ఉంటుందని విషయాన్ని స్పష్టం చేసింది.. అవినీతి అనేది ఎక్కడ జరగకుండా ఉండాలని శాసనసభ్యులు లంచం తీసుకోకుండా ఉండాలని తెలియజేశారు.. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అది కూడా అవినీతి నిరోధక చట్టం కిందికే వస్తుందంటూ కోర్టు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: