ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారంలోకి రావడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వైఎస్ షర్మిల మాత్రం వదులుకోవడం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం అమలు చేసే స్కీమ్స్ ఇవేనంటూ షర్మిల 9 అద్భుతమైన హామీలను ఇచ్చారు.
 
అయితే విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో పదో వంతు ప్రజానికానికి కూడా షర్మిల ఇచ్చిన హామీలు ఏంటో తెలియదు. షర్మిల ఇచ్చిన హామీల గురించి రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ హామీలు అద్భుతం ప్రచారం శూన్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా, పేద మహిళలకు ఏడాదికి లక్ష సాయం, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, 50 శాతం లాభంతో పంటలకు మద్దతు ధర లాంటి హామీలను షర్మిల ఇచ్చారు.
 
ఉపాధి కూలీల వేతనం పెంపు, 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అర్హులకు 4000 దివ్యాంగులకు 6000 పెన్షన్, పేద ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు, ఇతర హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఏపీలో ఎవరినైనా కాంగ్రెస్ హామీల గురించి తెలుసా అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హామీలు ఇచ్చిందంటూ రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు.
 
ఏపీలో ఎన్నికలకు 43 రోజులు మాత్రమే ఉండగా షర్మిల ప్రచారంలో వేగం పెంచాల్సి ఉంది. కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 3 నుంచి 4 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో షర్మిల ఎక్కడినుంచి పోటీ చేసినా ఆమెకు గెలుపు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో షర్మిల గెలిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ కొంతమేర పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: