రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన ఆసక్తికర పరిణామాలు నేపథ్యంలో ఎవరు గెలుస్తారని చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ లో కీలక నేతగా వ్యవహరించిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగుతోంది. మొదట బీఆర్ఎస్ టికెట్ అందుకున్న కడియం కావ్య ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. దీంతో కావ్యం ఓడించేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోటగా పేరు సంపాదించుకుంది. ఇక్కడ నుండి ఎంతో మంది ఉద్యమకారులు బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సమయంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యకర్తలు రోడ్లపై కడియం దిష్టిబొమ్మలను దానం చేశారు అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వరంగల్ పార్లమెంలటరీలో బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కావ్య మహిళ కాబట్టి స్వప్నను బరిలో దింపితే మహిళ ఓట్లు సైతం పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు పావులు కదిపినట్టు సమాచారం అందుతుంది. కడియం కావ్యపై తన పోటీ చేస్తానని టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం సుముకత వ్యక్తం చేయలేదని సమాచారం. రాజయ్య స్వప్నతో పాటు మరికొందరు సైతం వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇస్తుందన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు ఇకనుండి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ బరిలో దిగుతున్నారు. ఆరూరి రమేష్ కడియం శ్రీహరి టుడే కావడం విశేషం. దీంతో గురువు కూతురుతోనే ఆరూరి రమేష్ తలపడబోతున్నారు. ఈ క్రమంలో వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఎవరు కైవాసం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs