ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా మారిపోయాయ్. ఈ లోకసభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మరోసారి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయినా మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి అటు కెసిఆర్ ని మానసికంగా కూడా దెబ్బకొట్టేందుకు రేవంత్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ వేశాడట.


 ఇప్పటికే పార్టీలోని నేతలు అందరిని కూడా కారు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు రేవంత్. కెసిఆర్ కు వరుసగా షాక్ లు ఇస్తూనే ఉన్నాడు   ఇలాంటి సమయంలో సొంతూరు జిల్లా అయిన మెదక్ ను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఇక కేసీఆర్ దెబ్బ కొట్టాలని అనుకుంటున్నాడట. కాగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు టికెట్ దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ పి వెంకట్రామిరెడ్డి, బిజెపి నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు అని చెప్పాలి.  మెదక్ కు చెందిన స్థానిక నేత మైనంపల్లి హనుమంతరావు ఇక ఆయన కుమారుడు ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మెదక్ ఎంపీ స్థానంలో గెలుపు పై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.



 ఇప్పటికే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోని కీలకమైన బీఆర్ఎస్ నేతలు అందరిని కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ ఉన్నారట మైనంపల్లి హనుమంతరావు. కాగా ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది. అయితే మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా తూప్రాన్ మున్సిపాలిటీలోనూ హస్తం ఇప్పటికే పాగా వేసింది. ఇలా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని కీలకమైన బిఆర్ఎస్ నేతలు అందరిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకొని.. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నీలం మదుని భారీ మెజారిటీతో గెలిపించాలని మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: