ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె... వైయస్ షర్మిల "వైయస్సార్ తెలంగాణ" పేరుతో 8 జూలై 2021 న ఓ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఈమె పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి క్రేజ్ కలిగిన బీ ఆర్ ఎస్ , కాంగ్రెస్ , బీ జే పీ లలో టికెట్ దక్కని వారు ... ఆ పార్టీలలో గుర్తింపు సరిగ్గా లేనివారు ఈమె వెంట నడిచారు. ఈమె కూడా పార్టీ స్థాపించిన కొత్తలో ఎంతో మంది తెలంగాణ నాయకులపై విమర్శలను చేసింది.

కొన్ని సందర్భాలలో ఏమి మాట్లాడుతుందో తెలియకుండా చేసిన వ్యాఖ్యలు వైరల్ కూడా అయ్యాయి. ఇక కొంత కాలం పాటు షర్మిల తెలంగాణ లోని చాలా ప్రాంతాలలో పాదయాత్ర కూడా చేసింది. ఈ పాదయాత్రలో భాగంగా కూడా ఈమె చేసిన అనేక వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈమె తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించిన తర్వాత ఈమె వెంట నడిచిన తెలంగాణ నాయకులలో కొండా రాఘవరెడ్డి ఒకరు.

ఈయన తెలంగాణ లో షర్మిల తో పాటు చాలా కాలం ప్రయాణం చేశాడు. చాలా కాలం పాటు ఆమెతో ప్రయాణం చేసిన తర్వాత ఈమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం తోనే ఈయన ఆమెపై ఫైర్ అయ్యాడు. అలాగే అసంతృప్తిని వ్యక్తం చేసి ఆ పార్టీకి కూడా రాజీనామా చేశాడు. ఆ తర్వాత వైయస్సార్ పేరుతో పార్టీని పెట్టి దానిని విలీనం చేయడం ఏంటి అంటూ ఆయన షర్మిలపై విమర్శలు చేశాడు.

ఇక ఇప్పటికే షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె స్టేట్ మారిన కొండ రాఘవరెడ్డి మాత్రం షర్మిల ను వదలడం లేదు. ప్రస్తుతం ఈయన కడప జిల్లాలో తిరుగుతున్నాడు. షర్మిల తీరును ఈయన తప్పుబడుతూ వస్తున్నాడు. ఆమె తెలంగాణలో ప్రవర్తించిన తీరు... ఆంధ్రలో ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆయన మాట్లాడుతూ షర్మిలపై అనేక విమర్శలను చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: