తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ... జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా వీరు తాజాగా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీ పేట లో కూటమి అభ్యర్థుల తరపున భారీ రోడ్‌ షో ను నిర్వహించారు. ఈ రోడ్ షో కు భారీ ఎత్తున జనాలు వచ్చారు. దానితో ఈ రోడ్ షో భారీ సక్సెస్ అయ్యింది.

ఇక దీని అనంతరం ప్రజాగళం సభను ప్రారంభించారు. ఇందులో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉమ్మడిగా ప్రసంగించారు. ఇక ఈ సభకు భారీ మొత్తంలో జనాలు రావడం అరుపులు , కేకలతో వారి ఉత్సాహాన్ని తెలపడంతో చంద్రబాబు నాయుడు మీ ఉత్సాహాన్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది అని ... ఇదే ఉత్సాహాన్ని ఓట్లు వేసే రోజు కూడా చూపించి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చంద్రబాబు చెప్పుకొచ్చాడు.

అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతాను అని చెప్పాడు. రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి ఐదు సంవత్సరాల నరకానికి , సంక్షోభానికి , సమస్యలకు చెక్ పెట్టే సమయం వచ్చిందని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తమ పార్టీల జెండాలు వేరైనా... అభివృద్ధి , సంక్షేమం , ప్రజాస్వామ్య పరిరక్షణే అజెండా అని తేల్చిచెప్పారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు, యువతకు భరోసా ఇవ్వడానికి మా మూడు పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి.

నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను. మీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా మీకు చాలా త్వరగా వాటికి పరిష్కారం మార్గాలను చూపుతాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పర్యటిస్తూ ఉండడంతో ఈ పర్యటనకు ప్రత్యేక క్రేజ్ ఈ ప్రాంతంలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: