ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజకీయం తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు  నాయకులు పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులను  కారణంగా చూపుతూ విమర్శలు చేసేవారు. పదవిలో ఉన్న అభివృద్ధి శూన్యం అంటూ రాజకీయంగా మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరు కాదన్న..w ఎవరు అవునన్నా ఇది మాత్రం వాస్తవం అన్నది అందరి మనసులో ఉన్న భావన. ఎంతోమంది తమ కులానికి చెందిన నేతనే గెలిపించుకోవాలని అనుకుంటుంటే ఇంకొంతమంది.. కులాలను తెరమీదకి తెచ్చి రాజకీయ విమర్శలు చేయడం కూడా చూస్తూ ఉన్నాం.



 అయితే ఇప్పుడు వరకు ఏపీలోని ఎంతోమంది రాజకీయ నాయకులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లు చేసుకున్న వారు ఉన్నారు. ఇలా రెండు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు  పెళ్లి చేసుకొని ఇక రాజకీయాలు రాణిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం హయాంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపే విశ్వరూప్ ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈయన.. గతంలో వైయస్సార్ ప్రభుత్వ హయాంలో కూడా  నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఈయన.. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈస్ట్ గోదావరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.  


 అయితే పినిపే విశ్వరూప్ ఏకంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన విశ్వరూప్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. కేవలం ఇక మంత్రి పినిక విశ్వరూప్ మాత్రమే కాదు ఆయన ముగ్గురు కొడుకులు కూడా  ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడం గమనార్హం. పినిపే విశ్వరూప్ పెద్ద కొడుకు  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకోగా.. మరో కొడుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో కొడుకు ఏకంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గమానార్హం. ఇలా పినిపే విశ్వరూప్ కుటుంబంలోనే అన్ని కులాలు సమ్మేళనం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: