కూటమిలో భాగంగా సీట్ల  పంపకాల పైన అభ్యర్థుల పైన ఇంకా తర్జనభర్జన అవుతోంది టిడిపి బిజెపి జనసేన పార్టీ. గత కొద్ది రోజులుగా తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసలను మార్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరూ కూడా ఈయనను వ్యతిరేకిస్తూ ఉండడంతో జనసేన పార్టీ మరొకసారి కసరత్తు ప్రారంభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సైతం సమావేశమై అందులో పవన్ కళ్యాణ్ , పురందేశ్వరి నారా లోకేశ్ పాల్గొన్నారు.


ఈ సమావేశంలో ఐదు సీట్ల అభ్యర్థుల పైన మార్పుపై పరు రకాల చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలా తిరుపతి అభ్యర్థి పైన కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన ఆరణి శ్రీనివాసులు అక్కడ ఎవరికీ తెలియదని.. కేవలం స్థానికేతురుడికి టికెట్ ఇవ్వడం అంటే  కూటమినేతల సైతం వ్యతిరేకిస్తూ ఉన్నారు. స్థానికులలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కలిసి పని చేస్తామని తెలియజేశారట. మరి జనసేన నేతలు చేస్తున్న ఈ పని ఫలిస్తుందా అనే చర్చ కూడా జనసేన పార్టీలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోని తిరుపతిలో కిరణ్ రాయల్ కు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందంటూ ఆయన అభ్యర్థిత్వం పైన కూడా చాలామంది ముగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొదటినుంచే పవన్ కు కిరణ్ రాయల్ మంచి స్నేహబంధం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినప్పటికీ ఈ వాక్యాలను కిరణ్ రాయల్ తనదైన స్టైల్ లో కౌంటర్లు వేశారు.. గత కొన్నేళ్లుగా  జనసేన పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కిరణ్ తిరుపతి అభ్యర్థిగా ప్రకటిస్తారనే జనసేన వర్గాల నుంచి బాగా ఈ వార్తలు జోరందుకుంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజమైతే తెలియదు కానీ ఇప్పుడైతే తిరుపతిలో జనసేన పార్టీ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: