వరంగల్ పార్లమెంట్ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది గత కొంతకాలం నుంచి తెలంగాణ రాజకీయాలు ఇదే విషయంపై చర్చ జరుగుతుంది ముందుగా ఇక బిఆర్ఎస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న కడియం శ్రీహరి కూతురు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కావ్యకు సీటు కేటాయించారు కేసిఆర్. కానీ కడియం కావ్య అనూహ్యంగా బరిలోకి దిగడం విషయంలో యూటర్న్ తీసుకుంది. పార్టీ ప్రతిష్ట దిగజారి పోయింది అంటూ ఒక లేఖను గులాబీ దళపతికి రాసి ఇక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది..ఇక అంతలోనే కాంగ్రెస్ కండువా కూడా కప్పుకుంది.


 అయితే ఏ వరంగల్ ఎంపీ టికెట్ అయితే కడియం కావ్య వదులుకుందో.. అదే వరంగల్లో నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగింది. దీంతో బీఆర్ఎస్ కు కోలుకోవాలని దెబ్బ తగిలింది. అయితే ఇక వరంగల్ నుంచి ఎవరిని పోటీకి దింపాలో తెలియక కేసీఆర్ కి పెద్ద తలనొప్పి మొదలైంది. ఎంతోమంది నేతల పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. దీంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ విషయంపై గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవలే క్లారిటీ ఇచ్చి ఉత్కంఠకు తెరదించారు.


 మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు కేసిఆర్ ఫైనల్ చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బిఆర్ఎస్ నాయకులు అందరితో సుదీర్ఘమైన చర్చ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం హనుమకొండ జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్న సుధీర్ కుమార్ ను ఇక బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాడు. కాగా 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడుగా, పార్టీ విధేయుడుగా అధినేత కేసిఆర్ తో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్.. సరైన అభ్యర్థి అని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: