ఆంధ్రప్రదేశ్‎లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే ప్రచారజోరును ప్రతిపక్ష పార్టీ టీడీపీ,అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు పెంచాయి.అయితే కొన్ని చోట్ల టీడీపీలో ముసలం పుట్టిందనే చెప్పాలి. సొంత పార్టీనేతలలోనే సమన్వయం లేకపోవడం వల్ల అది టీడీపీ పార్టీకే ఒక మచ్చు లాగా తయారవుతుంది.దాంట్లో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అనేది టీడీపీకి ఒక కంచుకోట లాంటిది.అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో రాజుల మధ్య పోరు స్టార్ట్ అయిందనే చెప్పాలి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం.దాంతో నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్గా ఐనా సరే పోటీ చేస్తానంటూ హెచ్చరిస్తున్నారు.అయితే దానితోనే ఇబ్బంది పడుతున్న టీడీపీకి ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది.నరసాపురం ఎంపీ అయినా రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడం వల్ల ఆయనకి ఉండి టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో రామరాజు మరియు అతని వర్గం తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.ఒకవేళ నన్ను కాదని రఘురామకృష్ణరాజు కి టికెట్ ఇస్తే మాత్రం సహించేదిలేదని అవసరం అయితే పార్టీ మారుతామని ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు జారీ చేసారు.

రామరాజు తన అనుచరులతో జరుపుతున్న ఆత్మీయ సమావేశాలు ఆయన్ను రెచ్చగొట్టి కావాలంటే స్వతంత్రంగా బరిలోకి దింపడానికి సన్నద్ధం చేస్తున్నారు.రామరాజు చివరిసారిగా టీడీపీ అధిష్టానానికి ఫైనల్ వార్నింగ్ జారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.గత అయిదేళ్లుగా పార్టీని నియోజకవర్గంలో కాపాడుతూ వస్తున్నా నేను కావాలో లేదా రఘురామకృష్ణరాజు కావాలో తేల్చుకోమని అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు.దాంతో రఘురామకృష్ణరాజు చేరిక అనేది టీడీపీలో రగడగా మారిందని తెలుస్తుంది.ఒకవైపు రఘురామకృష్ణరాజు వర్గం ఆయన వైసీపీతో విభేధించి టీడీపీలో నాలుగేళ్లుగా ఉన్నారని ఆయన్ని గుర్తించి టికెట్ ఇవ్వాలని లేకపోతే అది టీడీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు.అయితే ఇలాంటి పరిణామాలు టీడీపీలో ఎలాంటి పరిస్థితులకి దారి చూపుతాయో టీడీపీలో భయం అనేది మొదలైందని తెలుస్తుంది.దాంతో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి చేజారిపోతుందనే ఆందోళన టీడీపీలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: