ఎన్నికలు వచ్చాయంటే చాలు టికెట్ల   విషయంలో నేతలకు తలనొప్పులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కో  నియోజకవర్గంలో నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు తప్పనిసరిగా ఉంటున్నారు. దీంతో అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించాలో తెలియక సతమతమవుతోంది.  ఇదే తరుణంలో ఉండి నియోజకవర్గంలో టీడీపీ  టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల మధ్య  తీవ్రమైన పోటీ ఏర్పడడంతో ముగ్గురు అభ్యర్థులు నాకు టికెట్ అంటే నాకు టికెట్ అని  నానా హంగామా చేస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో టికెట్ దక్కించుకునేది ఎవరు.చంద్రబాబు ఏమంటున్నారు. అనే వివరాలు చూద్దాం.. ప్రస్తుతం ఉండి టికెట్ కోసం  రామరాజు మరియు శివరామరాజు మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇదే తరుణంలో కొత్తగా రఘురామ కృష్ణంరాజు కూడా బరిలోకి వచ్చారు. దీంతో అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలో తర్జన  భర్జన పడుతోందట. ఇదే తరుణంలో విషయం  చంద్రబాబు దాకా వెళ్ళింది.

 ఉండి ఎమ్మెల్యే రామరాజు చంద్రబాబు బస చేసే ప్రాంతానికి  భారీగా కార్యకర్తలతో కలిసి వెళ్లారు. టికెట్ మార్పు ప్రచారంపై గందరగోళం నెలకొందని  చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. నాకు టికెట్ విషయంలో స్పష్టత కావాలని ఆయనను ప్రశ్నించారట. అయితే ఉండి టికెట్ చంద్రబాబు రామరాజుకి ప్రకటించారు. కానీ టికెట్ లో మార్పు జరుగుతుందనే ప్రచారం  జోరుగా తెరమీదికి రావడంతో టెన్షన్ పడ్డాటువంటి రామరాజు అభిమానులంతా ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టికెట్ మార్చితే పార్టీకి రాజీనామా చేస్తానని అల్టిమేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

 ఉండిలో రామరాజును తప్ప వేరే వ్యక్తిని ఒప్పుకోమని తెగేసి చెబుతున్నారట. ఇదే తరుణంలో ఉండి కార్యకర్తలకు కూడా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా హైకమెండ్ తీసుకుంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని ఏదైనా నాకు వదిలేయాలని ఆయన గట్టిగా  అన్నారట. కార్యకర్తల తీరుపై కోపానికి వచ్చిన చంద్రబాబు సమావేశం నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇంతటి ఉత్కంఠ మధ్య టికెట్ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: