సాధారణం గా రాజకీయాల్లో రక్త సంబంధాలకు తావు లేదు అని అంటూ ఉంటారు ఎంతో మంది నేతలు. ఈ క్రమం లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఏకంగా సొంత కుటుంబీకుల పైన లేదంటే రక్తం పంచుకుని పుట్టిన తోబుటుల పైనే పోటీ చేసేందుకు రెడీ అవుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఎవరైనా సొంత కుటుంబంకుల పైన పోటీ చేస్తున్నారు అంటే అది కాస్త ఇక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటుంది.


 ఆ స్థానం లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒడిస్సా రాజకీయాల లో ఇలాంటి పరిణామాలు కాస్త ఎక్కువ గానే చోటు చేసుకుంటున్నాయ్. ఏకంగా సొంత కుటుంబీకులే పోటీ లో నిలబడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక తమ పిల్లల రాజకీయ భవిష్యత్తును నిలబెట్టేందుకు సొంత పార్టీని వదిలి మరో పార్టీ తరఫున ప్రసారం చేసేందుకు కొంతమంది నేతలు రెడీ అవుతున్నారు.


 ఇలా రాజకీయాల్లో రక్త సంబంధాలకు తావులేదు అని అందరూ అంటుంటే.. కొంతమంది నేతలు మాత్రం కన్న ప్రేమను కాదనలేక దశాబ్దాలుగా అవకాశాలు ఇచ్చిన పార్టీని దిక్కరించి కొడుకుల కోసం అదే పార్టీకి ఎదురెళ్తున్నారు. ఒడిస్సాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయ్ ( 80) దశాబ్ద చాలా నుంచి హస్తం పార్టీలో ఉన్నారు. ఇక ఈ పార్టీలో ఎన్నో కీలక పదవులను కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు సురేష్ రౌత్రాయ్ కొడుకు మన్మధ రౌత్రాయ్ బిజెడి పార్టీ తరపున భువనేశ్వర్ ఎంపీగా బరిలో నిలిచారు. దీంతో తల్లి లాంటి పార్టీని కాదని ఇక ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు కోసం బీజేడి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు సురేష్ రౌత్రాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: