ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గట్టిపట్టు చూపించాలి అని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. మరికొన్ని రోజుల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేనతో పొత్తులో భాగంగా పోటీ చేస్తుంది. ఈ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వల్ల పార్టీలో చాలా పట్టు ఉన్న కొంతమంది సీనియర్ నాయకులకు కూడా సీట్లు దక్కలేదు. అలా పార్టీ కోసం ఇంతకాలం పని చేసి సీటు దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దానితో వారు అక్కడ కూటమి లో భాగంగా సీటు వచ్చిన అభ్యర్థులకు కూడా సపోర్ట్ చేయకపోవడంతో అది పెద్ద ప్రమాదంగా మారుతుంది అని ప్రస్తుతం కూటమి భావిస్తుంది. దానితో అసంతృప్తి నేతలను ఎలాగైనా బుజ్జగించి పార్టీ కోసం, కూటమి కోసం పని చేసే విధంగా వారిని తయారు చేయాలి అని ప్రస్తుతం కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ సమస్యను అధిగమించడంపై మూడు పార్టీలు నేతలు దృష్టి సారించారు.

మరోవైపు అసంతృప్తి సెగలు భారీగా వీస్తున్న నియోజకవర్గంలో క్యాండిడేట్ల మార్పుపై కూడా కూటమి నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా అనేక విషయాలను చర్చించడం కోసం తాజాగా ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం జరిగింది. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కూటమినేతలు చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వార్డు స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని విషయాలలోనూ క్యాడర్ బలంగా పని చేసే విధంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి అని వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎలక్షన్లు దగ్గర పడిన సమయంలో ప్రధాని మోదీతో సహా అమిత్ షా , నడ్డా , రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలను ప్రచారంలోకి దింపి ప్రజలను మరింత ఆకర్షించాలి అని ఎన్డిఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: