పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న. ఎవరికి వారు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఇక ప్రత్యర్థి పార్టీలను ఇరుకులో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇక అదే సమయంలో తమ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై హామీల వర్షం కురిపిస్తున్నారు . అయితేగత కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు అన్న విమర్శలు చేస్తుంది టిఆర్ఎస్ ఇక రేవంత్ బిజెపి లో చేరబోతున్నారని విమర్శలు చేసింది.


 ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో బిజెపిని గెలిపించేందుకు కాంగ్రెస్ నుంచి రేవంత్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాడు అంటూ ఆరోపిస్తుంది విఆర్ఎస్ ఇక ఇదే విషయంపై ఇటీవలే సిద్దిపేట ఎమ్మెల్యే టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సైతం స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం దోహదపడే విధంగానే కాంగ్రెస్ బలహీనమైన డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుంది అంటూ ఆరోపించారు హరీష్ రావు కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య తెలంగాణలో చీకటి ఒప్పందం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇటీవల కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో ఇందులో పాల్గొన్న హరీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు



 అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో బిజెపి బడామీయ అయితే కాంగ్రెస్ చోటా మియా అంటూ విమర్శించారు మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ నిజాంబాద్ సహా మరికొన్ని పార్లమెంట్ నియోజకవర్గం బిజెపిని గెలిపించేందుకు రేవంత్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు . ఇలా చీకటి ఒబ్బందం కుదుర్చుకొనిముందుకు సాగుతున్న కాంగ్రెస్ బిజెపిలో ఇక ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: