పొలిటికల్ మాస్టర్ మైండ్ గా పేరు సంపాదించుకున్న కేసీఆర్ వారసుడిగా తెలంగాణ రాజకీయాలకు పరిచయమయ్యారు కేటీఆర్. విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తి  తెలంగాణ రాజకీయాల్లో ఎలా ఇమడగలడు అని అనుకున్న ప్రతి ఒక్కరి నోళ్లు మూయిస్తూ తనలో ఉన్న టాలెంట్ ఏంటో చూపించాడు. కెసిఆర్ కు తగ్గ వారసుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇక తన వాక్చాతుర్యంతో తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ది బెస్ట్ ఐటి మినిస్టర్ గా తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.


 ఏ సమస్యపై కేటీఆర్ మాట్లాడాలని అనర్గలంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రసంగాలు కూడా గొప్పగా ఉంటాయి. కానీ అలాంటి కేటీఆర్ ఇప్పుడు ఇలాంటి మాట అన్నాడు ఏంటి అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.. పొరపాటున అన్నాడా లేకపోతే కావాలనే ఇలాంటి కామెంట్ చేశాడా అని కొంతమంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు మీకు ఓటు వేసి అధికారాన్ని కట్టబెడితే.. తెలంగాణ ప్రజల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడతారా  అంటూ ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ అన్న మాట ఏంటో తెలుసా తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర వాళ్ళు బాగా తెలివైనోళ్ళు అని.


 ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కేటీఆర్.. ఈ క్రమంలోనే పొరుగున ఉన్న ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు అని యాంకర్ అడగగా అందరూ నాకు కావాల్సిన వాళ్లే. ఎవరు గెలుస్తారు అని చెప్పలేను. కానీ ఎవరు గెలిచిన ఆంధ్రకు మంచి జరిగితే చాలు అంటూ చెప్పారు కేటీఆర్. అక్కడితో చెప్పి వదిలేయకుండా ఆంధ్ర ప్రజలు చాలా తెలివైనోళ్ళు.. చాలా చైతన్యవంతులు.. తెలంగాణ ప్రజల లాగా కాదు అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. తెలంగాణ ప్రజలు తెలివి లేని వాళ్లు కాబట్టే మిమ్మల్ని రెండుసార్లు ఎన్నుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ ప్రజలను అనే ముందు ఆ తెలంగాణలో మీరు ఒక ఓటరే అన్న విషయం మర్చిపోయారా కేటీఆర్ గారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: