కేసీఆర్  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేసి రాష్ట్రాన్ని సిద్ధించేలా చేసిన నేతల్లో ముఖ్యుడు అని చెప్పవచ్చు.  అలాంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు ఏకధాటిగా అధికారంలోకి వచ్చి  తనదైన శైలిలో పాలన చేశారు. ప్రతిపక్షం అనే మాట లేకుండా చేశాడు. అలాంటి కేసీఆర్ స్ట్రాటజీ  2023 అసెంబ్లీ  ఎన్నికల్లో మిస్ అయింది అని చెప్పవచ్చు. ఒకప్పుడు అద్భుత వ్యూహాలు పన్నే కేసీఆర్ ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ లో కూడా  వెనుకబడి పోతున్నారు. 

దీనికి ప్రధాన కారణం వరంగల్ ఎంపీ టికెట్ అని చెప్పవచ్చు.  పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించారు. ఆమె అనూహ్యంగా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో అక్కడ టికెట్ పై చాలా ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం తర్వాత అంతటి పేరు ఉన్న నేత  తాటికొండ రాజయ్య. ఆయన పార్లమెంట్ టికెట్ కోసం ఎన్ని పైరవీలు చేసిన ఆయనను కాదని డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు ప్రకటించారు. 

ఈ ప్రకటన చూసిన రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ వ్యూహాలు, స్టాటజీలు మిస్ అవుతున్నారని, ఎంతో పేరు ఉన్నటువంటి రాజయ్యను పక్కనపెట్టి సుధీర్ కు టికెట్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా రాజయ్య  స్టేషన్గన్పూర్ టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్ ను  కెసిఆర్ కడియం శ్రీహరికి కేటాయించడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రాజయ్య మళ్లీ కెసిఆర్ ను కలిసి ఎంపీ టికెట్ అడిగినట్టు తెలుస్తోంది.  కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా సుధీర్ కి ఇవ్వడంతో కడియం కావ్యను ఎదుర్కోవాలి అంటే  రాజయ్య అయితేనే బలమైన అభ్యర్థి అని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా మారెపల్లి సుధీర్ కి ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వరంగల్ బిజెపి నుంచి  ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ విధంగా త్రిముఖ పోరులో  గెలుపు ఎవరిది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: